Suryaa.co.in

Andhra Pradesh

అశోక్‌కు..ఇవ్వాల్సిన మర్యాదలన్నీ ఇచ్చాం:మంత్రి వెల్లంపల్లిశ్రీనివాస్

విజయనగరం : విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌ గజపతి రాజు వీరంగం సృష్టించారని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. ప్రోటోకాల్‌ ప్రకారమే శిలా ఫలకంపై పేర్లు రాయించామని చెప్పారు. ఆలయ ధర్మకర్తకు ఇవ్వాల్సిన అన్ని మర్యాదలు ఇచ్చామని వివరించారు. బోడికొండపై కోదండరాముడి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో వెల్లంపల్లి ఈ మేరకు స్పందించారు.

రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో వచ్చే శ్రీరామనవమికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. రామతీర్థం ఆలయాల అభివృద్ధికి రూ.4కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు అభివృద్ధి చేస్తున్నామని వెల్లంపల్లి వివరించారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ‘‘అశోక్‌ లాంటి పెద్ద వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. మనం ఎవరి రాచరిక వ్యవస్థలో లేము.. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. శంకుస్థాపనకు పిలవడానికి వెళ్లిన ఈవో, ప్రధాన అర్చకులను తిట్టారు. రామతీర్థం ఆలయాన్ని రెండో భద్రాద్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ బొత్స అన్నారు.

LEAVE A RESPONSE