సిగ్గు లేదు … శరం లేదు
నోటిలోని మాటతప్ప…
నిలదీసే దమ్ములేదు
భయం మాటున దాగిన
బడా చోర్ల బాగోతం బయటపడింది
నోటికి తాళం వేసి గాంభీర్యం గర్జన
దగా పడ్డ తెలుగు తల్లి బిడ్డలారా
తెగువ చూపి కదలండి బిర బిర
వడి వడిగా అడుగులేసి కదలండి
నీ సత్తువ.. నీ తెగువ.. నీదైర్యం
నెత్తురు మండే సూరీడల్లే తెగ పడు
ఎగసి పడే సముద్ర మల్లే తిరగబడు
నీతోడుగా నీకండగ నీ వెంటే.. నీతోనే ఉందోయ్ ..ఎర్రని జెండా
భయం వద్దు.. బిడియం వద్దు
పద పద పద పద నిలదీద్దాం
నీ ఓటు తో గద్దెనెక్కి న నేతలను
నిగ్గదీసి అడుగుదాం పద పద పద
మేమున్నాం… మేమున్నాం..నీ వెంటే
మేమున్నాం.. పాలకుల పని పట్టగ
పద పద పద పద జర జర జరనడు
విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ వద్దని నిలదీద్దాం…. రండి
– రెడ్డి శంకరరావు
9494333511