– పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు రిటర్న్ గిప్ట్ ఖాయం
– టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్యను ఖండిస్తున్నాం
-మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
అధికారం మదంతో ఇప్పుడు వైసీపీ రౌడీమూకలు చేస్తున్న ప్రతి అరాచకానికి భవిష్యత్ లో మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
పల్నాడులో జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో టీడీపీ కార్యకర్త జల్లయ్యను వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరుల వేధింపులకు భయపడి 3 ఏళ్ల నుంచి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్న జల్లయ్య శుభ కార్యం కోసం వస్తే దారుణంగా వేటకొడవళ్లతో నరికి చంపారు. మరో ఇద్దరు బక్కయ్య, యల్లయ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
వైసీపీ నేతల రక్త దాహానికి అంతులేకుండా పోయింది. పల్నాడులో పిన్నెల్లి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అతనికి భయపడి పల్నాడులో అనేక మంది పొరుగూర్లలో తలదాచుకుంటున్నారు. గతంలో బీసీ నాయకుడు చంద్రయ్యను నడిరోడ్డుపై గొంతు కోసి చంపారు. ఇప్పుడు శుభకార్యం కోసం వచ్చిన మరో బీసీ కార్యకర్త జల్లయ్యను దారికాచి చంపారు. గురజాలలో దోమతోటి విక్రమ్ ను పోలీసులు పిలిపించి ప్రత్యర్ధులకు అప్పజెప్పి హత్య చేయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను సొంతూళ్ల నుండి తరిమేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఫ్యాక్షన్ మూలాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జగన్ రెడ్డి ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తున్నారు.
హత్యలు, దాడులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్తస్తైర్దాన్ని దెబ్బతీయాలనుకోవటం భ్రమ. మాచర్లలో టీడీపీ ఇన్ చార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని ఇచ్ చార్జ్ గా నియమించాక అక్కడ ప్రజలు దైర్యంగా పిన్నెల్లి అరాచకాలకు ఎదురు తిరుగుతున్నారు. పల్నాడులో వైసీపీ బలహీన పడుతుందన్న భయంతోనే హత్యలకు పాల్పడుతున్నారు. పల్నాడులో వైసీపీని సమాధి కట్టడం ఖాయం. 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు.
టీడీపీ కార్యకర్తలపై చేస్తున్న దుశ్చర్యలకు భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదు. దాడులను ప్రోత్సహిస్తున్న వైసీపీ నేతల్ని సహా దాడులకు పాల్పడుతున్న వారిని బట్టలూడదీసి కొడతాం. అధికారం మదంతో ఇప్పుడు రెచ్చిపోతున్న వారంతా రేపు పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. మీకు జైల్లు కూడా సరిపోవు. చేస్తున్న ప్రతి అరాచకానికి బదులు చెల్లిస్తాం. హత్యకు గురైన జల్లయ్య కుటుంబానికి చంద్రబాబు భరోసా ఇచ్చారు, వారికి టీడీపీ అండగా ఉంటుంది. టీడీపీ 40 ఏళ్ల ప్రస్తానంలో అనేక ఆటుపోట్లతో ఎదుర్కోంది. హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో టీడీపీ కార్యకర్తలను జగన్ రెడ్డి భయపెట్టలేరని గ్రహించాలని ఆనందబాబు అన్నారు.