Suryaa.co.in

Political News

తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదోక వంక పెట్టి అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడే అవకాశం లేకుండానే స్పీకర్ గారి అధికారంతో సస్పెండ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ జంగారెడ్డిగూడెంలో సారాయి తాగి నిట్టనిలువునా 36 మంది చనిపోతే దానిమీద చర్చించడం కోసం ప్రతిపక్ష టిడిపి ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తే వారికి అవకాశం ఇవ్వకుండా, చర్చ జరపకుండా వైయస్సార్ సిపి పార్టీ ఎమ్మెల్యేలు రచ్చ, రచ్చ చేశారు. అందుకు స్పీకర్ గారు కూడా వంతపాడి వారిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు .

చాలామంది ప్రేక్షకులు, ప్రజలు అసెంబ్లీలో ఒక విషయం మీద చర్చ లో ఏ ఎమ్మెల్యే ఏ విధంగా స్పందించారు, మాట్లాడారు అని చాలామంది ఉత్సాహంగా చూసేందుకు ఉంటారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర లేకపోతే అది చప్ప గా ఉంటుంది. అసెంబ్లీకి అసలు నిండుదనం రాదు . ఏ విషయమైనా వాస్తవాల్ని ప్రజలకు తెలియజేసే అధికారిక వేదిక అసెంబ్లీ. అటువంటి అసెంబ్లీలో ప్రతిపక్షానికి స్పీకర్ గారు అసలు అవకాశమే కల్పించకపోతే ,ఇవ్వకపోతే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి నట్టే.

జంగారెడ్డిగూడెంలో జరిగిన సారాయి మరణాల సంఘటనలు పత్రికల్లో వచ్చింది గాని ,వివిధ రాజకీయ పార్టీలు పోయి విచారించింది గాని, ప్రభుత్వ పెద్దలు ,మంత్రులు పోయి విచారించిన విషయాలు గాని అసెంబ్లీలో చర్చ లేకపోతే సమాజానికి ఏ విధంగా తెలుస్తుంది.

ఒకవైపు పత్రికలు జంగారెడ్డిగూడెం లో ప్రజలు సారాయి తాగే మా భర్తలు చనిపోయారని చెబుతుంటే ప్రభుత్వం వారి మాటలు లెక్కలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారే అవి అన్ని సాధారణ మరణాలే అని వారు అసెంబ్లీ లో చెప్పడం విడ్డూరం.పోనీ దాని మీద ప్రతిపక్ష పార్టీని చర్చకు అవకాశం కల్పిస్తారా అంటే అదీ లేదు సస్పెండ్ చేస్తారు. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యం.

ఒకవైపు ఈ సారాయి మరణాలు మొదలైన తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దాడులు చేసి 1129 మీద కేసు నమోదు చేశారు. 679 మందిని అరెస్టు చేశారు. 13 471 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. 57 670 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 47 వాహనాలను సీజ్ చేశారు. మరి అక్కడ అసలు సారాయి తయారీ కాకుండా ఉంటే ఇదంతా,ఈ దాడులు అంతా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కదా చేసింది మరి దీనికేం సమాధానం చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి. ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి వేయాల ని భారత రాజ్యాంగ నిర్మాత కీర్తిశేషులు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినందుకు అసెంబ్లీలో బిజెపి సభ్యులు ఆ విషయాన్ని చర్చించాలని బిజెపి సభ్యులు పట్టుబడితే ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీ మొదలైన ఐదు నిమిషాల లోనే అసెంబ్లీ జరిగినన్ని రోజులు వారిని అసెంబ్లీకి రాకుండా స్పీకర్ గారు సస్పెండ్ చేశారు.

ఎంత ఘోరంగా ఉందో చూడండి కెసిఆర్ గారు ఒక నియంత లాగా, ఒక రాజు లాగా, ఒక దొరలాగా భావిస్తూ ఆయన చెప్పిందే వేదంగా భావిస్తూ ఆయన సొంత జిల్లాలోనే వందల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ చాలెంజ్ చేసి గెలిచిన ఈటెల రాజేందర్ గారిని, రఘునందన్ రావు గారిని, హైదరాబాద్ పాతబస్తీలో మీసం మెలేసి గెలిచిన రాజా సింగ్ గారిని ఆయనకు కంట్లో నలుసులా తయారైన ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేల ధాటికి తట్టుకోలేక, స్పీకర్ కు ముందే చెప్పుకొని అసలు చర్చే లేకుండా వారిని సస్పెండ్ చేయడం జరిగింది .ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి ప్రధానమంత్రిగారు ఆ సమయంలో ఆనాటి ప్రతిపక్ష నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంటుకు ఎన్నిక కాక, ఓడిపోవడం జరిగింది. ఆనాడు ఆనాటి ప్రధానమంత్రి గారు అన్న మాటలు ఏంటంటే ప్రతిపక్షంలో వాజ్ పాయ్ గారు లేక ఈ పార్లమెంట్ కు నిండుదనం లేదు అని మాట్లాడారు.

ఆ రోజుల్లో వాజపేయి గారు ప్రభుత్వాన్ని పార్లమెంట్లో చాలా ఘాటుగా, దీటుగా విమర్శించేవారు. ప్రభుత్వం కూడా ఎంతో హుందాగా స్వీకరించి పార్లమెంట్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించేది. ప్రపంచ ప్రజలందరూ చూసి ఆనందించేవారు అది మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ.

మరి మన దేశంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా అసెంబ్లీలు జరుగుతున్నయొ ఒక్కసారి ప్రజలందరూ గమనించ వలసినదిగా మిమ్మల్ని కోరుకుంటూ ,రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో నిజాయితీగా రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించే బిజెపి పార్టీలను గెలిపించ వలసినదిగా కోరుకుంటూ..

– కరణం భాస్కర్
బిజెపి ,
7386128877.

LEAVE A RESPONSE