Suryaa.co.in

Andhra Pradesh Entertainment

ఏపీ సినిమాల (నియంత్రణ-సవరణ) బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

అమరావతి: ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు ఉద్దేశించిన ‘ఏపీ సినిమాల (నియంత్రణ-సవరణ) బిల్లు’ను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.పేర్నినాని మాట్లాడుతూ…
సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను విక్రయించడం, నిర్దేశిత ఆటలతోనే సినిమాలు ప్రదర్శించడం, పన్ను ఎగవేతను అడ్డుకోవడమే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాల విధానం లక్ష్యం.సినిమా ప్రేక్షకుల ఆదరణ ను కొందరు అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో సినిమా టిక్కెట్‌పై ఇష్టారాజ్యంగా రూ.300 నుంచి రూ.500 వరకు అధికంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు.తెల్లవారకముందే సినిమా షోలు వేస్తున్నారు. రోజుకు 4 ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సినా చట్ట విరుద్ధంగా 6-8 షోలు నిర్వహిస్తున్నారు. ఇష్టానుసారం సినిమా టికెట్‌ ధరలను పెంచుకుంటూ పోతున్నారు.చిత్ర పరిశ్రమలో కొందరు మాకు ఎదురు ఉండకూడదు.. ఏ చట్టాలూ మమ్మల్ని ఆపలేవు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకుల బలహీనతల్ని సొమ్ము చేసుకోకుండా, టిక్కెట్ రేట్లను కట్టడి చేయడానికి ప్రభుత్వం ముందు ఉన్న మార్గం ఆన్‌లైన్‌ టికెట్ విక్రయాల వ్యవస్థ మాత్రమే .సినిమా ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం ద్వారా టిక్కెట్లు విక్రయించే వ్యవస్థ తేవాలని నిర్ణయించింది.
బస్సులు, రైలు టికెట్ల మాదిరిగా సినిమా టిక్కెట్లను కూడా మొబైల్‌ ఫోన్లు, ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. గంట ముందు థియేటర్‌లో కూడా బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే అక్కడ కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే థియేటర్ల యజమానులు టిక్కెట్లు విక్రయించాలి.ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు నాలుగు సినిమా ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుంది.ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కంటే కొన్ని పార్టీలు, పేపర్లు, ఛానళ్లు.. ఆన్‌లైన్‌ టికెట్ విక్రయాల వ్యవస్థ మీద బురదజల్లుతున్నాయి.
ఆన్‌లైన్ విధానంలో టికెట్ ఇచ్చే విధానంపై సినీ జనాలకు లేని అభ్యంతరం టీడీపీ, జనసేన పార్టీలకు ఎందుకు? .నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు ఆన్‌లైన్‌ సినిమా టికెట్ విక్రయాల విధానాన్ని సమర్థిస్తున్నారు.సమాజ హితం కోసం స్వచ్ఛంద సంస్థలు థియేటర్‌ యాజమాన్యాలతో కలసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే బెనిఫిట్‌ షోలకు అవకాశం ఉంటుంది.అదనపు సినిమా షోలు దొంగాటలే. చట్టప్రకారం 4 షోలు మాత్రమే వేయాలి.మా ప్రభుత్వానికి పెద్ద హీరో చిన్న హీరో అనేది లేదు. మేము ప్రేక్షకుల కోణంలో మాత్రమే చూస్తాం. ఆన్‌లైన్‌ సినిమా టిక్కెట్ల విక్రయాల విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఒక పెద్ద హీరో ఏమి ఇబ్బంది ఉందొ చెప్తే.. అది సహేతుకమైతే పరిశీలిస్తాం.

LEAVE A RESPONSE