-వంతెన రంగు మార్చారు.. ఇది జగన్ రెడ్డి మెప్పు కోసం ఓ అధికారి పాట్లు అనుకోవాలా?
– బాధ్యత మరిచిన బడుద్దాయి అనాలా?
– పదవిలో ఉన్న బులుగు పార్టీ కార్యకర్త అనాలా?
– ఏపీలో రోడ్ల దుస్థితి పై ట్విట్టర్లో టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
రోడ్ సేఫ్టీ కోసం కొన్ని ప్రమాణాలు ఉన్నాయి.. అందులో ఒకటి పసుపు, నలుపు రంగులను రోడ్డు చివర డివైడర్లు, తదితర నిర్మాణాలకు వాడటం. ముఖ్యమంత్రికి పసుపు కనపడకూడదు అని రంగులు మార్చాడు అట ఈ బుద్ధి లేని అధికారి.. ఆఖరుకు కలశం కూడా పసుపు రంగు ఉండొద్దు అన్నాడు అట. ఇలాంటి పెంపుడు జంతువులు, పనుల కోసం తమ వద్దకు వచ్చే సామాన్య ప్రజలకు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా నిష్పక్షపాతంగా సేవ చేస్తారా?
నెలా, రెండు నెలల క్రితం కూడా రాష్ట్రంలో రోడ్ల దుస్థితి గురించి ఇదే వేదికగా ముఖ్యమంత్రిని ప్రశ్నించడం జరిగింది. అసలే రోడ్లు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి అంటే, ఇలాంటి అధికారులు తమ తుగ్లక్ నిర్ణయాలతో ఇలా అడ్డగోలుగా రంగులు మార్చి వేస్తే, వాహనదారుల ప్రాణాలకు ఎవరిది బాధ్యత? చేతనైతే రాష్ట్రంలో అత్యంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న రోడ్లను బాగు చేయండి.. మీ అసమర్ధత కు తోడు, కొత్తగా ఇలాంటి రంగుల పైత్యం తోడయితే ఇక ప్రజల ప్రాణాలు గాల్లోనే..