తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోకొనసాగి పార్టీకి, ప్రజలకు, కార్యకర్తలకు కష్టసుఖాల్లో అండగాఉండి, విశేషమైన సేవలందించిన గొప్పవ్యక్తి డాక్టర్ కోడెలశివప్రసాదరావు అని టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో జరిగిన కోడెల శివప్రసాదరావు ద్వితీయవర్థంతి కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు.
పేదల వైద్యుడిగా పల్నాడు ప్రాంతంలో సేవలందించిన కోడెల, నందమూరి తారకరామారావు ఆహ్వానంతో తెలుగుదేశం పార్టీలో చేరి, తనకృషి, పట్టుదలతో అనేకపదవులు అలంకరించి, వాటికి వన్నె తెచ్చారని అచ్చెన్నాయడు కొనియాడారు. ఉమ్మడిరాష్ట్రంలో అనేక శాఖలకు మంత్రిగా, రాష్ట్ర విభజానంతరం నవ్యాంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా శివప్రసాదరావు చేసినసేవలు చిరస్మరణీయమైనవన్నారు. ప్రజలకు సేవచేయడం, కష్టాల్లో ఉన్నవారికి సహాయపడటంతప్ప, కోడెలకు మరో ధ్యాస ఉండేది కాదన్నారు. తనపనితీరు, ప్రతిభతోనే ఆయన ప్రజల హృదయాల్లో కొలువుతీరారని చెప్పడానికి తానెంతో గర్వపడుతున్నా నని అచ్చెన్నాయుడు తెలిపారు. కోడెలశివప్రసాదరావు కి ఎన్నోఇబ్బందులు, సమస్యలు ఎదురైనా భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేశారన్నారు. అలాంటి వ్యక్తి ఆశయసాధనకోసం ప్రతిఒక్క టీడీపీ కార్యకర్త కృషిచేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కోడెలశివప్రసాదరావుని స్మరించుకుంటూ, తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, పార్టీనేతలు, కార్యకర్తల, కోడెల గారి అభిమానులందరి తరుపున హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానన్నారు.
వర్థంతి కార్యక్రమంలో మాజీఎమ్మెల్సీ టీ.డీ.జనార్థన్, పార్టీ అధికార ప్రతినిధి పిల్లిమాణిక్యరావు, మంగళగిరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, వీరంకి గురుమూర్తి, కుమారస్విమి ఇతరనేతలు, కార్యకర్తలు పాల్గొని కోడెలచిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళుల ర్పించి అంజలి ఘటించారు.