టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ అధికారంలోకి నాటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తల పై భౌతిక దాడులు చేసి, ఆర్దిక మూలాలు దెబ్బతీసినా టీడీపీ శ్రేణులు భయపడకుండా వైసీపీ అరాచకాలపై పోరాడుతున్నారు. వైసీపీ అరాచక, అవినీతి పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దారి మళ్లించేందుకు ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి జాతీయ చంద్రబాబు ఇంటిపై దాడి చేసినా దైర్యంగా ఎదుర్కొన్నాం.
వైసీపీ రౌడీ మూకలు దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు.వైసీపీ డ్రగ్స్, అక్రమ వ్యాపారాలపై పట్టాభిరాం ప్రశ్నిస్తే వైసీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై ఆపీసుపై దాడికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటన దేశంలో ఎప్పుడు జరగలేదు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయి – ఇది వాస్తవం కాదా? ఈ విషయం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసులు సైతం చెబుతున్నారు.
మీ తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? వైసీపీ అరాచకాలను దేశానికి తెలిజేయాలని ఈ 36 గంటల దీక్ష చేస్తున్నాం. పోలీసుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు టీడీపీ నివాళి అర్పిస్తోంది. రాష్ట్రంలోని డీజీపీ, కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో అమరులైన పోలీసుల ఆత్మ ఘోషిస్తోంది.
ఇలాంటి పోలీసు వ్యవస్ధను దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు, గూండాలు, రౌడీలను కొంతమంది పోలీసులు కమ్మక్కయ్యారు. డీజీపీ ఆపీసుకు కూతవేటు దూరంలో దాడి జరిగితే కనీసం డీజీపీ స్పందించలేదు, పోలీసుల పనితీరుపై ప్రజలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ నేతలు బూతులు మాట్లాడలేదని ముఖ్యమంత్రి అంటున్నారు…. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన ఏమై మాట్లాడారో ఇప్పుడు వైసీపీ మంత్రులు, నేతలు ఏం మాట్లాడుతున్నారో చర్చకు సిద్దమా? ప్రతిపక్షంలో చంద్రబాబు ను నడిరోడ్డుపై కాల్చాలి, చీపుర్లలతో కొట్టాలని జగన్ అనలేదా? వివేకాందరెడ్డి హత్య, కోడికత్తి కేసు చంద్రబాబు, లోకేశ్ , టీడీపీకి ఆపాదించి లబ్ది పొందిన పార్టీ వైసీపీ.
వైసీపీ ఎన్ని అరాచకాలు చేసినా టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా రక్షణ కవచంలా పార్టీని కాపాడుతున్నారు. వైసీపీ చేసే అరాచకాల్లో మేం అధికారంలో ఉన్నపుడు 1 శాతం చేసినా మీ పరిస్థితి ఏంటి?టీడీపీని భూస్ధాపితం చేయాలని జగన్ అనుకుంటున్నారు.అది జగన్ తండ్రి తాత వల్లే కాలేదు, ఇక జగన్ వల్లే ఏమవుతుంది?
ప్రజల కోసం పుట్టిన పార్టీ టీడీపీ టీడీపీని ఎవ్వరూ ఏం చేయలేరు. పట్టాభి ఇంటిపై దాడి చేసి 48 గంటలు గడిచినా ఇంతవరకు ఒక్కరిని అరెస్టు చేయని పోలీసులు పట్టాభినే అరెస్టు చేశారంటే ఈ డీజీపీ, పోలీసులు ఎంత దిగజారారో అర్దమౌతోంది. టీడీపీ కార్యాలయంపై దాడికి చేసిన రౌడీ మూకల్ని పోలీసులే సాదరంగా సాగనంపారు.
టీడీపీ కార్యాయలంలో పట్టుబడ్డ పోలీసును కాపాడినందుకు. తిరిగి టీడీపీ నేతలపైనే హత్యయత్నం కేసులు పెట్టారు, డీజీపీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల్ ఖబడ్డార్… మీ చిట్టాలన్ని రాస్తున్నాం….. రిటైర్ అయి, లేదా వేరే చోటికి వెళ్లి పోవచ్చనుకుంటున్నారేమో – రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడున్నా వదలం. మెగుడిని కొట్టి మెగసాలకు ఎక్కినట్టు వైసీపీ వైఖరి ఉంది, మేం బంద్ కి పిలుపునిస్తే వాళ్లు నిరసనలకు పిలుపునిచ్చారు.
మేం దీక్ష చేస్తుంటే..వైసీపీ పోటీగా ప్రజాగ్రహ దీక్ష చేస్తుంది.దేశంలో అత్యధిక ప్రజాగ్రహం ఉన్న ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలలో జగన్ , వైసీపీ ఎమ్మెల్యేలు మెదటి స్దానంలో ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. కానీ విషయం అందరికీ తెలియదు, దీన్ని ప్రజలందరకీ తెలియజేయాలనే వైసీపీ ప్రజాగ్రహ దీక్షలు చేస్తున్నట్టుంది.
వైసీపీ నేతలు గంజాయి, మద్యం వ్యాపారం చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు.చంద్రబాబు హయాంలో గంజాయి అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణిచివేశాం జగన్ ఏనాడైనా గంజాయి అక్రమ రవాణా, మత్తు పధార్ధాలపై సమీక్ష చేశారా?
డ్రగ్స్, కరెంట్ బిల్లులు, నిత్యవసర ధరలు, అప్పులు వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దాడులు చేస్తున్నారు. మీరెన్ని డ్రామాలాడినా ప్రజలు మీకు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. రాష్ట్రం డ్రగ్స్ కి అడ్డాగా తయారయింది, రాష్ట్రాన్ని ఫ్రీడ్రగ్ స్టేట్ గా రూపొందించే వరకూ లోకేష్ ఆధ్వర్యంలో పోరాడుతాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం టీడీపీదే.. ప్రతి గ్రామంలోని కార్యకర్తలకు చెబుతున్నా…మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న వైసీపీ నేతలు, పోలీసులు, అధికారుల చిట్టా రాసి పెట్టండి మనం అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూద్దాం.