– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ ప్రభుత్వం నియంతృత్వపోకడ రోజు రోజుకీ హద్దుమీరుతోంది. తూ.గో జిల్లా రాజవొమ్మంగి మండలం దొడ్డి గ్రామంలో జీలుగు కల్లు తాగి చనిపోయిన అమాయక గిరిజనుల కుటుంబాలను పరామర్శించేందుకు, ఘటనకు సంబందించి నిజాలు వెలికి తీసేందుకు వెళ్లిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల్ని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడాన్ని ఖండిస్తున్నాం. గిరిజనుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతల్ని అడ్డుకోవటం ఏంటి? ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? టీడీపీ నేతలు అక్కడికెళ్తే వైసీపీ ప్రభుత్వ తప్పులు భయటపడతాయనే అడ్డుకున్నారా? పోలీసులు అదుపులోకి తీకోవటం ఏంటి? టీడీపీ నేతల్ని వెంటనే విడుదల చేయాలి. గిరిజనుల మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి.