– జగన్ రెడ్డి ప్రభుత్వ దురాగతానికి పరాకాష్ట
– అధికారంలోకి వచ్చిన వెంటనే మూల్యం చెల్లించుకోక తప్పదు!
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై, దోపిడీ విధానాలుపై సోషల్ మీడియా సాక్షిగా గళమెత్తిన టిడిపి సోషల్ మీడియా కార్యకర్త కోన వెంకట్రావును వైసిపి గూండాలు పొట్టనబెట్టుకోవం జగన్ రెడ్డి ప్రభుత్వ హత్యాకాండకు నిదర్శనం. కోన వెంకట్రావు మృతి ముమ్మాటికీ వైసిపి నాయకుల హత్యే.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం పోతంగి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త కోన వెంకట్రావును వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలకు పురిగొల్పిన వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ , వైసిపి గూండాలపై పోలీసులు తక్షణమే హత్యకేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శ్రీకాకుళం జిల్లాలో ఒక మహిళ మంగళసూత్రాన్ని అధికార పార్టీ గూండాలు తెంపేశారు.
పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలకు మాత్రమే రాష్ట్రంలో రక్షకులుగా మారారు. టిడిపి కార్యకర్తలను పొట్టనబెట్టుకున్న ప్రతి వైఎస్సార్ సిపి నేత రాబోయే రోజుల్లో తగు మూల్యం చెల్లించుకోక తప్పదు.
కోన వెంకట్రావు మృతికి తెలుగుదేశం పార్టీ తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఆయన కుటుంబసభ్యులకు మా ప్రగాడ సానుభూతి. వెంకట్రావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్నివిధాలా అండగా నిలుస్తుంది.