కేరళలో అగ్నికి ఆహుతైన భవనం….ఐదుగురి మృతి

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వర్కలా పట్టణంలోని దలవపురం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది.

భవనంలో నివాసముంటున్న ప్రతాపన్(62), షెర్లీ (53), అభిరామి (25), అఖిల్ (29), అభిరామి ఎనిమిది నెలల కుమారుడు రియాన్‌లు మంటల్లో కాలి మరణించారు.ఇంటి యజమాని ప్రతాపన్ కూరగాయలు వ్యాపారి.ఇతను గత కొంతకాలంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు చెప్పారు.తీవ్ర గాయాలపాలైన ప్రతాపన్ పెద్ద కుమారుడు నిహుల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.భవనంలో మంటలను గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో అగ్నిమాపకశాఖ వాహనాలు వచ్చి మంటలను ఆర్పాయి.

ఈ అగ్నిప్రమాదంలో ఐదు బైక్‌లతోపాటు ఇంట్లోని ఎయిర్‌ కండిషనర్లు కాలి బూడిదయ్యాయి.ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనేది నిర్ధారణకు రాలేమని అధికారులు చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులు స్థలాన్ని పరిశీలించిన తర్వాత అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దివ్య గోపీనాథ్ తెలిపారు.

Leave a Reply