ఇదేనా మీరు చెప్పే రైతు రాజ్యం?

– ట్విట్టర్లో ప్రభుత్వానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సూటి ప్రశ్నలు

* రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులకు మరమ్మత్తులు లేవు, సరైన నిర్వహణ లేదు.
* మొరాయిస్తున్న గేట్లు.. మొన్న పులిచింతల గేటు, నిన్న గుండ్లకమ్మ గేటు.. నేడు తాండవ జలాశయం కాలువ రెగ్యులేటింగ్ గేటు.. నీరంతా వృధా..
* శ్రీశైలం ప్రాజెక్ట్ స్పిల్ వే వద్ద ఏర్పడ్డ అతిపెద్ద గొయ్యిని గురించి సేఫ్టీ కమిటీ హెచ్చరించినా నేటి వరకూ పూడ్చలేదు.
* గత ప్రభుత్వంలో పరుగులెత్తిన పోలవరం ప్రాజెక్ట్, నేడు పూర్తిగా పడకేసింది.
* నత్త నడకన సంగం బ్యారేజ్ పనులు.
* గుండ్లకమ్మ నీరంతా సముద్రం పాలు చేశారు. రైతులకు సాగు నీరు లేదు, మత్స్య సంపద నాశనం, అక్కడి మత్స్యకారుల పొట్టపై కొట్టారు. పాడి సంపదపై ఆధార పడ్డ రైతులకూ ఇది పెద్ద దెబ్బే.
* నీటి కాలువల నిర్వహణ లేదు. పూడుకుపోయిన కాలువల వల్ల చివరి భూముల వరకూ నీరు చేరని వైనం.
* జలసిరి లేదు, జల కళ లేదు.. రైతులకు ఏ ప్రయోజనం లేదు.
* టమాటా, వరి ధాన్యం, బంతి.. ఇలా పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు.
* ఏదో ఒక ధరకు అమ్మిన పంట కు ఎన్ని నెలలైనా బకాయిలు చెల్లించరు.
* ఆర్బీకేలు పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందం.. అది వైసీపీ వారి కోసమే ఏర్పాటయిన వ్యవస్థ అని రైతులు మధనపడుతున్నారు.
* మోటర్లకు మీటర్ల పేరుతో రైతుకు ఉరి తాళ్ళు..
* విత్తు వేసే దగ్గర నుండి, ధాన్యం అమ్మి సొమ్ము చేతికి వచ్చే వరకూ ప్రతి అడుగులో అవరోధాలు, ప్రతికూల పరిస్థితులతో అన్ని వైపుల నుండీ ఒత్తిడి పెరిగి దిక్కు తోచక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
* ఇక్కడ జత చేసిన సమస్యలను చూసి, వీటన్నింటికీ పరిష్కార మార్గాలు చూపి రైతుల ప్రాణాలు కాపాడాలి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
* అన్ని రకాలుగా భ్రష్ఠు పట్టించి ఇన్ని సమస్యల పుట్టలు రైతుల నెత్తిన వేసిన ఈ అసమర్థ ప్రభుత్వం తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గు చేటు. ఇవన్నీ గమనించాలని ప్రజలను కోరుకుంటున్నాను.

Leave a Reply