దళితులకోసం అమలుచేసిన 27సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారు
అంబేద్కర్ విదేశీవిద్య, స్టడీ సర్కిల్స్ ను తిరిగి ప్రారంభిస్తాం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
కోడుమూరు నియోజకవర్గం వెంకయ్యపల్లి దళితులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
వారేమన్నారంటే..
• వైసీపీ ప్రభుత్వంలో సబ్సిడీలోన్లు నిలిపేశారు.
• సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లించింది.
• గతంలో ఎన్ఎస్ఎఫ్ డిసి పథకం కింద దళితులకు వాహనాలు ఇచ్చేవారు. ఇప్పుడు నిలిపివేశారు. బ్యాంకు లింకేజీ లోన్లు నిలిపేశారు.
• చిరు వ్యాపారులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడంలేదు.
• రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వడంలేదు, బోర్లు వేయడం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి
– యువనేత లోకేష్ ను కలిసిన దళితులు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎస్సీలకు సంక్షేమం, రక్షణ రెండూ కరువయ్యాయి.
• గత నాలుగేళ్లలో రూ.28,147కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించిన దళితద్రోహి జగన్ రెడ్డి.
• దళితులను వైసీపీ నాయకులు చంపి డోర్ డెలివరీ చేసిన వారికి వైసీపీ నాయకులు సన్మానాలు, పాలాభిషేకాలు చేస్తున్నారు.
• దళితులపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న దుర్మార్గపు పాలన జగన్ ది.
• గత టిడిపి ప్రభుత్వం దళితులకోసం అమలుచేసిన 27సంక్షేమ పథకాలను జగన్ రద్దుచేశారు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.
• ఎస్సీలపై తప్పుడుకేసులు పెట్టి వేధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
• ఎస్సీ రైతులకు గతంలో మాదిరి పూర్తి సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేస్తాం.
• ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అంబేద్కర్ విదేశీవిద్య, స్టడీ సర్కిల్స్ ను తిరిగి ప్రారంభిస్తాం.