Suryaa.co.in

Andhra Pradesh

నిండు శాసనసభలో దళిత ఎమ్మెల్యేపై వైసీపీ ఎమ్మెల్యేల దాడి దుర్మార్గం

– టిడిపి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎం.ఎస్ రాజు

నల్ల జీవో (నెం.1)పై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షపార్టీ నాయకులపై అసెంబ్లీ సాక్షిగా భౌతిక దాడులకు అధికారపక్షం పాల్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో వైసీపీ నేతల ప్రస్టేషన్ పెరిగిపోయింది. నిండు శాసనసభలో దళిత ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేయటం దుర్మార్గం. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ. శాసనసభలో దాడులు జరగడం జగన్ రెడ్డి సైకో మనస్థత్వానికి అద్దం పడుతుంది. ప్రజాస్వామ్య వాదులందరు ఈ దుశ్చర్యను ఖండించాలి. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. చట్టసభల్లోను ప్రతిపక్ష పార్టీకి రక్షణ లేదు.

అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి దాడులు జరుగుతుంటే ఇక బయట అధికారపక్షం ఇంకెన్ని దాడులకు పాల్పడుతుందో.. శాంతి భద్రతలకు ఎంత విఘాతం కలిగిస్తుందో గత 4 ఏళ్లుగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, గూండాలు శాసనసభలో అడుగుపెడితే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. కాబట్టి వైసీపీ రౌడీయిజం నశించాలంటే రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఘోరంగా ఓడించి తగిన బుద్ది చెప్పాలి.

LEAVE A RESPONSE