జగన్ రెడ్డి పాలనలో బడుగు, బలహీన వర్గాలను రక్షణ కరువు
-కె. ఎస్. జవహర్
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ముద్దాపురం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహనీయుల విగ్రహాలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి. ఈ దాడి అంబేద్కర్ పైనే కాదు దళితులపైనా, వారి ఆత్మగౌరవంపైనా జరిగిన దాడి. ఘటన జరిగిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షించి ఉంటే ఇలాంటివి మళ్లీ జరిగేవి కాదు. ప్రభుత్వం, పోలీసులు తమకేం సంబంధం లేనట్టు వ్యవహరించడం వల్లే మహనీయులకు పదే పదే అవమానం జరుగుతోంది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూ అంబేద్కర్ పైనే విషం కక్కుతున్నారు.
నాలుగేళ్లుగా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయింది. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ దళితుల హక్కులను సీఎం జగన్ రెడ్డి కాలరాస్తున్నారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన దళిత డాక్టర్ సుధాకర్, చీరాలకు చెందిన కిరణ్ ను పొట్టనపెట్టుకున్నారు. వైసీపీ నాయకుల అవినీతిని నిలదీసిన చిత్తూరు డాక్టర్ అనితా రాణి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి తన బుద్ధి మార్చుకోవాలి. మహానుభావల విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.