– పూర్తిగా కాలిపోయిన విగ్రహాలు
ఢాకా: బంగ్లాదేశ్ లో మరో ఇస్కాన్ దేవాలయాన్ని ఛాందసులు ధ్వంసం చేసి, తగలబెట్టారు. ఈ నమహత్త దేవాలయం ఇస్కాన్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. అయితే.. ఎవరైనా గాయపడ్డారా? లేదా? అనేది పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి వుంది. అయితే దేవాలయంపై ఛాందసులు దాడి చేశారని కోల్ కత్తా ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు. ఛాందసుల దాడిలో దేవాలయంలోని దేవతా విగ్రహాలు, ఇతర పూజా సామాగ్రి పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. దేవాలయం వెనుక భాగంలో వున్న పైకప్పును ఎత్తి, పెట్రోల్ తో నిప్పంటించారన్న అవగాహనకు తాము వచ్చామని తెలిపారు. ఉదయం 2 నుంచి 3 గంటల మధ్యలో ఈ దాడి జరిగిందన్నారు.