Suryaa.co.in

Andhra Pradesh

విలేకరులపై దాడులు చేయించడం జగన్ ఆకృత్యాలు, పిచ్చికి పరాకాష్ట

• ఫ్యాక్షన్ మనస్తత్వమున్న ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు, ప్రతిపక్షాలతో పాటు ప్రసార మాధ్యమాలకు కూడా రక్షణ లేకుండా పోయింది
• ప్రసారమాధ్యమాలు.. విలేకరులపై వైసీపీ దాడుల్ని తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తోంది
• మీడియా సంస్థకు అధిపతిగా ఉన్న వ్యక్తిపాలనలో సాటి మీడియాసంస్థలు, విలేకరులపై దాడులు బాధాకరం
• చొక్కాలు మడతపెట్టండి అని జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చింది ఇందుకేనా?
• సాక్షి తప్ప, ఇతర మీడియా సంస్థలంటే గిట్టనప్పుడు జగన్ రెడ్డి తన సభలు.. కార్యక్రమాలకు వాటిని ఎందుకు ఆహ్వానిస్తున్నాడు?
• దాడులు.. హత్యలు.. అత్యాచారాలే పదవులకు కొలమానాలని తన చర్యలు..చేష్టలతో జగన్ చెప్పకనే చెబుతున్నాడు
• దాడులు.. దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న జగన్ ఆటల్ని టీడీపీ-జనసేన సాగనివ్వవు
– టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా

కర్నూలులో ఈనాడు కార్యాలయంపై వైసీపీ అరాచకశక్తుల దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ఓటమిభయంతోనే జగన్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ఇలాం టి నీచ సంస్కృతికి పాల్పడుతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీ రా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ ప్రశ్నించే గొంతుల్ని చూస్తే జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోంది. తన పాలనలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, విధ్వంసాలపై ప్రశ్నించేవారిని దాడులతో భయపెట్టాలని జగన్ చూస్తున్నాడు. ఆ క్రమంలోనే చివరకు పత్రికా సంస్థలు, విలేకరులపై వైసీపీవారితో దాడులు చేయిస్తున్నాడు.

మీడియా సంస్థకు అధిపతిగా ఉన్న వ్యక్తిపాలనలో సాటి మీడియాసంస్థలు, విలేకరులపై దాడులు జరగడం బాధాకరం చొక్కాలు మడతపెట్టండి అని జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చింది ఇందుకేనా?
ఒక మీడియా సంస్థకు అధిపతిగా ఉన్న జగన్ రెడ్డి, సాటి మీడియా సంస్థలపై దాడులు చేయించడం ఎంతమాత్రం సరైన పద్ధతి కాదు. పత్రికాస్వేచ్ఛను కాపాడ లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా అనర్హుడు. ఓటమిభయం.. టీడీపీ, జనసేనపార్టీలకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని జగన్ చివరకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు.

ప్రజలు, విలేకరులు, పత్రికాసంస్థలు, ప్రతిపక్షాలపై దాడులు చేస్తేనే వచ్చేఎన్నికల్లో సీట్లు ఇస్తాను అన్నట్టుగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. గతంలో ఇలానే ప్రతిపక్ష నాయకులపై దాడి చేసిన వారికి, వారి ఇళ్లవద్దకు వెళ్లి వీరంగం వేసిన వారికి మంత్రి పదవి ఇచ్చాడు. చొక్కాలు మడత పెట్టండి అని చెప్పింది ఇందుకోసమేనా అని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం.

వైసీపీ అభ్యర్థుల్ని మార్చే పనిలో జగన్ ఉంటే, ఆయన్ని రాష్ట్రం నుంచి సాగనంప డానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
చట్టసభలకు, న్యాయవ్యవస్థకు, ప్రసారమాధ్యమాలకు రాజ్యాంగంలో సమాన ప్రాధాన్యత ఇచ్చారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాపై దాడికి పాల్పడుతు న్న జగన్ రెడ్డిని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థుల్ని మార్చే పనిలో జగన్ తీరికలేకుండా ఉంటే, ఆయన్ని.. వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడే మీడియా పై దాడికి పాల్పడే దుస్సాహసం జగన్ రెడ్డి తప్ప, రాష్ట్రచరిత్రలో ఇంతవరకు ఎవ రూ చేయలేదు. మీడియాసంస్థలు.. విలేకరులపై దాడులు చేయించడం జగన్ రె డ్డి ఆకృత్యాలకు, పిచ్చికి పరాకాష్ట అనే చెప్పాలి.

చంద్రబాబు హాయాంలో సాక్షి మీడియాపై టీడీపీ దాడిచేసిందా? జగన్ ఫ్యాక్షన్ భావజాలానికి అనుగుణంగానే వైసీపీ నాయకులు, సాక్షి మీడియా పనిచేస్తున్నాయి
సామాన్యులు, రాజకీయ నాయకులు, మేథావులు, విద్యావేత్తలు ప్రసారమాధ్య మాల ద్వారానే అనేక విషయాలు తెలుసుకుంటారనేది కాదనలేని వాస్తవం. అలాంటి మీడియాను టీడీపీ ప్రభుత్వం ఎంతగానో గౌరవించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడైనా సాక్షి మీడియాపై దాడులు జరిగాయా?

ఎలాంటి చర్యలైనా ఆయన తీసుకున్నారా? టీడీపీ శ్రేణులు సాక్షి కార్యాలయాల పై, విలేకరులపై దాడులు చేశారా? రాజకీయ విలువలు తెలిసిన వ్యక్తి కాబట్టే, తర..తమ బేధాలు లేకుండా చంద్రబాబు అందరి నీ సమానంగా గౌరవించారు. నేడు సాక్షి మీడియా టీడీపీపై, మిత్రపక్షం జనసేనపై విషం కక్కుతోంది. దారుణం గా తప్పుడు కథనాలతో దుష్ప్రచారం చేస్తోంది.

జగన్ రెడ్డి తన అవినీతి మీడియా ద్వారా ప్రజానాయకులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై బురదజల్లుతున్నా, వారు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. జగన్ ఫ్యాక్షన్ భావజాలానికి అనుగుణంగానే వైసీపీ నాయకులు, సాక్షి మీడియా పనిచేస్తు న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జగన్ రెడ్డి నేత్రత్వంలో వైసీపీ నాయకులు సాగిస్తున్న దోపిడీ, అవినీతి గురించి సాక్షి మీడియా ఏనాడైనా ప్రశ్నించిందా? వైసీపీ నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులకు పాల్పడి, వారిని హతమార్చినా సాక్షి మీడియాకు కనిపించదు. జగన్ రెడ్డి చెప్పిందే సాక్షి టీవీకి.. పత్రికకు వేదం.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచీ పనిగట్టుకొని మరీ కొన్నిమీడియాసంస్థలపై దుష్ప్రచారం చేస్తున్నాడు. జగన్ రెడ్డి ఎంతగా గింజుకున్నా.. ప్రసారమాధ్యమాలు ప్రజలపక్షానే నిలుస్తాయి. ఏ పత్రిక.. ఏ టీవీ అయినా ప్రజలకోసమే పనిచేస్తుంది గానీ, జగన్ రెడ్డి లాంటి నియంతల కోసం పనిచేయదు. పత్రికాస్వేచ్ఛను అడ్డుకోవడమంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలను ఆపడమేననే వాస్తవాన్ని జగన్ గ్రహించాలి. ప్రసారమాధ్యమా లపై దాడి చేయడమంటే రాజ్యాంగంపై దాడిచేయడమేననే నిజాన్ని వైసీపీ శ్రేణులు తెలుసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారు.

జగన్ చర్యలు…వైసీపీ నేతల దాడులు చూస్తుంటే, రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వా మ్యయుతంగా, స్వేఛ్చగా జరిగే పరిస్థితి లేదు
రాష్ట్రంలో ప్రసారమాధ్యమాలకు, విలేకరులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఏం ఉంటుంది? జగన్ రెడ్డి చర్యలు.. వైసీపీనేతల దాడులు చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, స్వేఛ్చగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రసారమాధ్యమాలు.. విలేకరులపై జరిగిన దాడులపై ఎన్నికల కమిషన్ స్పందించాలి. మీడియా స్వేచ్ఛకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాం.

వైసీపీ నేతలు చెప్పినట్టు చేస్తూ ఓటర్ల జాబితాలో అవకతవకలు.. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై కూడా ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలి. దొంగఓట్లను అరికట్టి, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి. వైసీపీ రౌడీల దాడులు నేడు కొన్ని పత్రికాసంస్థలు.. కొందరు విలేకరులకే పరిమితమయ్యాయి. మీడి యా సంస్థలు ఒక్కటై ఈ ప్రభుత్వంపై తిరగబడకపోతే, అన్నిసంస్థలు.. యాజమా న్యాలు ఏదో ఒకరోజు జగన్ దుశ్చర్యలకు బలికాకతప్పదు.

ఇతర మీడియాసంస్థలంటే గిట్టనప్పుడు తన సభలు.. ప్రభుత్వ కార్యక్రమాలకు జగన్ రెడ్డి వాటిని ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతోంది
“లక్షలాదిమందిని తరలిస్తూ, వేలకోట్ల ప్రజలసొమ్ముతో సభలు పెట్టుకుంటున్న జగన్ రెడ్డి..వైసీపీ నేతలు మీడియా సంస్థలు, విలేకరులపై దాడుల్ని ప్రోత్సహించడం బుద్ధిలేనితనమే. జగన్ రెడ్డి సభలకు సాక్షి మీడియాను మాత్రమే పిలుచు కుంటే సరిపోతుందిగా. ఇతర మీడియా సంస్థల్ని, గిట్టని విలేకరుల్ని వైసీపీ సభలకు, ముఖ్యమంత్రి కార్యక్రమాలకు ఎందుకు పిలుస్తున్నారో కొడాలినానీ చెప్పాలి. గతంలో జోగిరమేశ్ రౌడీలను వేసుకొని చంద్రబాబు ఇంటిపైకి వెళ్తే జగన్ అతన్ని మంత్రిని చేశాడు. కర్నూల్లో నిన్న ఈనాడు కార్యాలయంపై దాడిచేయిం చిన వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో జగన్ సీటు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.

ఇదేమీ విధానమో ముఖ్యమంత్రే ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏనాడూ ఇలాంటి చర్యల్ని సమర్థించలేదు. ఆఖరికి టీడీపీ నేతలు నోరుజారినా కూడా ఆయన సహించరు. ఆయన తన పార్టీ నేతల నుంచి కోరుకునేది ఏమిటంటే ప్రజలకోసం, అభివృద్ధికోసం పాటుపడటమే. జగన్ రెడ్డి మనస్తత్వం మొత్తం ఫ్యాక్షన్ భావజాలమే. అందుకే రౌడీలతో చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన వ్యక్తిని మంత్రిని చేశాడు.

ఇలాంటి చర్యలతో జగన్ మరలా ఎన్నికల్లో గెలవాలని చూస్తే టీడీపీ-జనసేన శ్రేణులు సహించరు. ప్రజాస్వామ్య రక్షణకోసం ప్రజలతో కలిసి వారు ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్లో నిశ్శబ్దవిప్లవం రాబోతుంది.” అని నాగుల్ మీరా తెలిపారు.

LEAVE A RESPONSE