Suryaa.co.in

Features

హిందువులపై ఎన్నాళ్లీ దాడులు..సహించాల్సిందేనా?

కాంగ్రెస్ పార్టీ అధికారమున్న దగ్గర ఒకరకంగా , అధికారంలోకి వచ్చే దానికి ఆరాటపడుతున్న దగ్గర ఇంకో రకంగా హిందువుల పైన దాడి చేసేవారిని మిన్న కుండడం చూస్తుంటే లెక్కలేని తనం, వీరినీతి స్పష్టంగా అర్థం అవుతుంది.
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఉరేగింపుతో పోతున్న కాషాయం ధరించిన హిందూ భక్తుల మీద అమానుషంగా మోటార్ వాహనం తొక్కిన ఘటన మనం చూశాం అందులో ప్రాణాలు కోల్పోయిన వారిని చూశాం. కనీసం అధికార పార్టీ కాంగ్రెస్ వారి మీద గట్టి చర్యలు తీసుకోకుండా వారు గంజాయి తాగి ఉన్నారు మత్తులో ఉన్నారు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, సాధారణమైన కేసులు పెట్టడం, యాక్సిడెంట్ కేస్ పెట్టడం క్షమించరాని నేరం .
లఖంపూర్ ఘటనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా వచ్చి కూర్చొని బీజేపీని ,యోగి ఆదిత్యనాథ్ గారిని, ప్రభుత్వాన్ని ఎంత ఇరుకున పెట్టాలో ఏ విధంగా అపఖ్యాతి పాలు చేయాలో చేయడానికి ప్రయత్నం చేసిన విషయం అందరికి తెలిసిందే. మంత్రి గారి కుమారుడు ఆఘటనలో లేనప్పటికీ , ప్రభుత్వానికి సహకరించాలని ఒక మంచి ఉద్దేశంతో వారిని అరెస్టు చేయడం జరిగింది .అందులో నలుగురు బీజేపీ కార్యకర్తలను, ఒక జర్నలిస్టు ను చంపి వేయడం జరిగింది .ఆ ఘటన మీద కాంగ్రెస్ పార్టీ, మిగతా రైతు నాయకులు ఎంత మాత్రం మాట్లాడారో, చంపి వేయబడ్డ వారి మీద చర్యలు తీసుకొనుటకు ఎంత మాత్రం సహకరించారో మనం అందరం చూశాం. అంటే కాంగ్రెస్ పార్టీకి వారి అధికారంలో ఉన్న దగ్గర హిందువుల మీద దాడులు జరిగితే, కాషాయ దారి హిందూ భక్తులు చనిపోతే వారికి లెక్క లేదు కానీ ,లఖంపూర్ లో జరిగిన ఘటనకు ఎంత రాద్ధాంతం చేశారు. మరి చత్తీస్ ఘడ్లో ఏమైనది ?.వీరి ద్వంద నీతిని క్రిస్టల్ క్లియర్ గా సమాజం అర్థం చేసుకోవాలి.
బంగ్లాదేశ్ లో అమ్మవారి ఆలయం మీద 200 మంది ముష్కరులు హింసాత్మక దాడి చేసి ఆలయ కమిటీ మెంబర్ ను ,ఆరుగురు భక్తులను చంపేయడం మనం చూశాం. ఈ మత ఛాందసవాదులను ఎంతకాలం హిందూ సమాజం భరించాలి భారతదేశంలో ఇతర మతస్తుల ప్రార్థన మందిరాలు మీద దాడి చేసి భక్తులను చంపేస్తే ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఏకతాటి మీద కొచ్చి ఎంత అలజడి సృష్టించేవారో ఒక్కసారి ఊహించుకోండి .
నా ఉద్దేశం ఇతర మతస్తుల భక్తుల మీద, ప్రార్థనాలయాలు మీద దాడులు చేయమని కాదు . మంచి సంప్రదాయం కూడా కాదు. కానీ ఎక్కడ ఘటన జరిగినా ఇతర మతస్తుల విషయంలో ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, హిందూ మతస్తులు మీద జరుగుతున్న దాడులకు కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని నా డిమాండ్. హిందూ సమాజం మెజారిటీగా ఉన్నప్పుడే మిగతా మతస్తులు సంతోషంగా వారి వారి కార్యకలాపాలు చేసుకుంటారు ఇది జగమెరిగిన సత్యం .
కాబట్టి ఆ పరిస్థితి ఈ దేశంలో రాకుండా ,ఇతర దేశాల్లో కూడా హిందువులు మైనార్టీలుగా ఉన్న దగ్గర ఇదేవిధంగా ఉండాలని నా కోరిక లేనిచో హిందూ ఉగ్రవాదులు తయారైతే ఎవరూ తట్టుకోలేరు గుర్తుంచుకోండి .

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

LEAVE A RESPONSE