Suryaa.co.in

Andhra Pradesh

కలశ దొంగతనానికి యత్నం..

ఎర్రగొండపాలెం పురాతన కృష్ణదేవరాయల నాటి కాలంలో నిర్మితమైన మిల్లంపల్లి వేణుగోపాలస్వామి ఆలయంలో నేటికి యత్నాలు చేస్తూనే ఉన్నారు .గతంలో సాక్షాత్తు ప్రధాన ద్వారం వద్ద హైదరాబాద్కు చెందినవారు గుప్తనిధుల కోసం వేట కొనసాగించారు నాడు వారిని అదుపులోకి తీసుకున్న నేటికి అది కేసు ఏ రూపంలో ఉన్నా ఎవరికీ అర్థం కాని విషయం.

కానీ ఒక సంవత్సరంలో ఒకమారు గుప్తనిధుల వేటగాళ్లు ఆలయంలో తమ వేటను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు కొందరు గోడలను పగులగొట్టి మరీ మట్టిని తొలిచి మరి తమ వేటను కొనసాగించి అది సఫలీకృతం కాలేదు .అది గతం గత కొద్ది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ఆలయంలో మరోమారు గుప్పనిధుల వేటగాళ్లు తమ ప్రతాపాన్ని చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆదివారం ఆలయ గోపురం కలశాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేశారు .కానీ అది సఫలీకృతం కాకపోవడంతో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

పురాతన ఆలయాలపై చారిత్రక సంపదపై దృష్టి సారించవలసిన అగత్యం ప్రభుత్వానికి ఉంది కానీ ఆ విషయంలో ప్రభుత్వాలు సైతం విఫలం అవుతూనే ఉన్నాయి .ఇప్పటికే పలుమార్లు మిల్లంపల్లి వేణుగోపాల స్వామి ఆలయంపై దుండగుల దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయి .భవిష్యత్తులో సైతం చారిత్రక ఆనవాళ్లు ప్రజలకు ఉండాలంటే ఇటువంటి ఆలయాలపై ప్రభుత్వం దృష్టి సారించి ఆలయ మనుగడను కాపాడటంతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చారిత్రక ప్రియులు కోరుతున్నారు. ఎర్రగొండపాలెం శివారులోని మీల్లంపల్లి వేణుగోపాలస్వామి గుడి పైన గల కలశం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తవ్వినట్లు కలశాన్ని దొంగతనం చేయడానికి ప్రయత్నించినట్లు టెంపుల్ పూజారి రిపోర్ట్ ఇచ్చిన మీదట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎర్రగొండపాలెం SI కోటయ్య తెలిపారు.

LEAVE A RESPONSE