Suryaa.co.in

Andhra Pradesh

వచ్చే ఎలక్షన్ నాటికి వెలిగొండ పూర్తి చేసి మీ ముందుకు వస్తా

-ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో సీఎం జగన్‌
-జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శన

మాట ఇస్తే తప్పనని జగన్ అంటారు. అది నిలబెట్టుకోవడంలోనూ ఆయన చూపుతున్న నిబద్ధత కూడా ఎప్పుడు చర్చకు వస్తూనే ఉంటుంది. ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతమైన ఎర్రగొండపాలెం లో నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు ఒక అడుగు ముందుకేసారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చీమకుర్తి పర్యటన వచ్చిన సందర్భంగా ప్రజల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వచ్చే ఎలక్షన్ నాటికి ఖచ్చితంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి సాగు, తాగు నీరు కొరత లేకుండా చేసి ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తానని తెలియజేశారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకొనే దాని ప్రకారం ఈరోజు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి పనులను పనులను త్వర త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించినట్లు సమాచారం…ఈరోజు ఉదయాన నుండి రాత్రి పొద్దుపోయే వరకు వెలిగొండ ప్రాజెక్టు మరియు ప్రాంతమైన సుంకేసుల గ్రామాన్ని సందర్శించి, చాలా తొందరలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంత వాసుల కల నెరవేరుస్తామని ఆయన తెలియజేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కృషి మరియు కల కూడా తోడు అయ్యి వెనుకబడిన ప్రాంతమైన వాసులకు మంచి రోజులు రాబోతున్నాయి.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి,పెద్దారవీడు పార్టీ మండల అధ్యక్షుడు పాలిరెడ్డి కృష్ణారెడ్డి, సుంకేసుల సర్పంచ్ గడ్డిపోగు రమేష్.. వివిధ శాఖల అధికారులు, వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

LEAVE A RESPONSE