హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు యువతులు సుష్మ,శుచి,ఒలి,అనుకృతి,శ్రుతి లు 5 రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి విహార యాత్రకు వెళ్లారు. రెండు రోజుల నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అకస్మాత్తుగా వరదలు రావడంతో వీరు వసతి ఉంటున్న హోటల్ లేమన్ ట్రీ లోకి వరద వచ్చి దాదాపు రెండు అంతస్థుల వరుకు నీళ్లు చేరడంతో బిల్డింగ్ పైకి చేరిన వీరు అక్కడ ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
అక్కడ అధికారులు త్వరగా స్పందించకపోవడంతో తెలంగాణా ప్రభుత్వం త్వరగా స్పందించి తమను కాపాడాలని ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ట్విట్టర్ ద్వారా వారు విజ్ఞప్తి చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. స్థానిక బిజెపి నాయకులు ఆర్.కె.శ్రీను ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి విషయం తెలిపారు. వెంటనే స్పందించిన కిషన్ రెడ్డి అక్కడి అధికారులతో మాట్లాడి సహాయం అందించి వారిని సురక్షిత ప్రదేశానికి తరలించారు.