-పేదలపై ప్రతాపం చూపే నువ్వు చట్టం నుంచి తప్పించుకోలేవు
-కల్తీ మద్యం, నకిలీ పత్రాల కేసులో జైలుకు పోవాల్సిందే
-నీ బెదిరింపు రాజకీయాలకు ప్రజలే చెక్ పెట్టబోతున్నారు
-2024లో సర్వేపల్లిలో ఎగిరేది తెలుగుదేశం పార్టీ జెండానే
-పొదలకూరులో మీడియాతో మాజీ మంత్రివర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సర్వేపల్లిలో టీడీపీ నాయకులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి వైసీపీలో చేర్చుకుంటున్నారు. వీరంపల్లిలో గిరిజన కుటుంబానికి చెందిన షిఫ్ట్ ఆపరేటర్ పై అలాగే పొదలకూరు మండలంలోని మర్రిపల్లిలో వే బ్రిడ్జ్ నిర్వహిస్తున్న సుధాకర్ గౌడ్ కు వైసీపీ వేధింపులు. ఆ వేధింపులు భరించలేకే వైసీపీలోకి సుధాకర్ గౌడ్. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్వేపల్లిలో కాకాణి దౌర్జన్యాలు, దుర్మార్గాలు పెరిగిపోయాయి.
నేను ప్రజా సమస్యలపై ఉద్యమిస్తుంటే అధికారులను బెదిరిస్తున్నారని చెప్పే మంత్రి కాకాణి, టిడిపి సానుభూతిపరులను భయభ్రాంతులకు గురిచేసి వైసీపీలో చేర్చుకుంటున్నాడు. పిఓటి కింద 5 వేలకు పైగా భూ పంపిణీ చేస్తున్నట్లు కాకాణి చెబుతున్నాడు. ఆర్టీఐ ద్వారా కోరితే 3200 ఎకరాల సమాచారం మాత్రమే అధికారులు ఇచ్చారు. మిగిలిన 2000 ఎకరాల వివరాలు ఏమయ్యాయి. కాకాణి అనుచరులకు, వైసీపీ నాయకులకు ఇచ్చినందునే ఆ వివరాలు బయటపెట్టడం లేదు.
చెరువులకు కూడా పట్టాలిచ్చారు. ఆ పట్టాలు దేనికి పనికిరావు. ప్రజలను మభ్యపెట్టడంలో భాగంగానే ఇలా చేస్తున్నారు. కల్తీ మద్యం, కబ్జా కేసులు, నకిలీ పత్రాల కేసుల్లో కాకాణి తప్పించుకోలేడు., జైలుకెళ్ళడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో కాకాణి బెదిరింపు రాజకీయాలకు ప్రజలే పుల్ స్టాప్ పెట్టబోతున్నారు. 2024 ఎన్నికల్లో సర్వేపల్లిలో ఎగిరేది తెలుగుదేశం పార్టీ జెండానే.