Suryaa.co.in

Andhra Pradesh

శ్రీశైలం ఆలయంలో పాము పట్టివేత

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో ఎనిమిది అడుగుల పాము కలకలం. పౌర్ణమి గడియలు సమీపిస్తున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో పాము సంచారం గర్భాలయం ఎదురుగా ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి మండపంలో పాము కనపడటంతో ఆచ్చర్యానికి గురైన భక్తులు. పామును చూసిన భక్తులు కేకలు వేయడంతో అక్కడకు చేరుకున్న ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యి స్నేక్ క్యాచర్ కు సమాచారం అందజేశారు. పాము ఉన్న ప్రదేశానికి వచ్చిన స్నేక్ క్యాచర్ రాజా చాకచక్యంగా పాము ను పట్టుకొని వెళ్ళాడు. కాగా గతంలో కూడా పౌర్ణమి రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు సంచరించడం జరుగుతుంది అని అవి ఎవ్వరికి ఎటువంటి హాని చేయవని భక్తులు, స్థానికులు, చర్చించుకుంటున్నారు.

LEAVE A RESPONSE