రాముడు కోట్లాదిమంది ఆరాధ్యదైవం. ఆయన ఆయుధం కోదండం. శ్రీరాముడి కోదండం ఆయన అధికారం, బలంకు చిహ్నం మాత్రమే కాదు…మర్యాదకు, త్యాగం, న్యాయబద్ధమైన అంశాల సందేశం కూడా.
శ్రీరాముని జన్మ స్థలమైన అయోధ్యకు శ్రీరాముని కోసం తయారు చేయించిన 286 కిలోల బరువు ఉన్న పంచలోహ కోదండం చేరుకుంది. ఈ నెల 3న ఒరిస్సా నుంచి శోభాయాత్రగా సనాతన జాగరణ్ మంచ్ – రూర్కెలా శోభాయాత్ర నిర్వహిస్తూ అయోధ్యకు కోదండంను తీసుకువచ్చింది.
అంతకు ముందు బంగారం, వెండి, అల్యూమినియం, జింక్, ఇనుము మొత్తం ఐదు లోహాలు వాడి తయారు చేయించిన కోదండంకు పూరిలో భగవాన్ జగన్నాధుని దర్శనం చేయించారు. శిల్పకారులు 8 నెలలపాటు తమిళనాడులోని కాంచీపురంలో శ్రమించి తయారుచేసిన కోదండం పై కార్గిల్ యుద్ధం, భారతీయ సైన్యం వీరత్వం, పరాక్రమ విజయాలు చెక్కారు.
శ్రీరాముడి మార్గాన్ని ఆచరించే కోట్లాది మందికి ఈ కోదండం సైతం ఎల్లప్పుడు ధర్మం, న్యాయం, మర్యాదలను పాటించాలనే సందేశాన్ని పంచుతుంది.
– వీఎస్కె తెలంగాణ సౌజన్యంతో