Suryaa.co.in

Andhra Pradesh

నత్తి పకోడీ.. బాబాయ్ పై గొడ్డలి వేటు ఎందుకేసావ్?

-ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై సీబీఐ విచారణ జరపాలన్న విజయసాయి
-ఎన్టీఆర్ కూతుళ్లను అవమానపర్చడం ఘనతగా భావిస్తున్నావా ?
-అమ్మని, చెల్లిని గౌరవించమని జగన్ కు ట్వీట్లు పెట్టు అంటూ సూచన
-టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు 

టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఆమె మరణంపై అనుమానాలు ఉన్నాయని… సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్, విజయసాయిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

‘కోడికత్తి నటన, గుండెపోటు డ్రామా, తల్లిని తరిమేయడం, చెల్లిని దిక్కులేని బాణంలా వదిలేయడం.. ఇవ్వన్నీ జగన్ రెడ్డి ట్రేడ్ మార్క్ సాయి రెడ్డి. సీబీఐ ఎంక్వైరీ ఎక్కడ నుండి మొదలు పెడదాం? కొడికత్తి డ్రామా నుండా లేక నీ అల్లుడు సారా కంపెనీల నుండా? ఎన్టీఆర్ గారి కుమార్తెలను అవమానపర్చడం పెద్ద ఘనతగా భావిస్తున్నావా సాయి రెడ్డి? ముందు ఇంట్లో ఉన్న అమ్మని, చెల్లిని గౌరవించమని మీ జగన్ రెడ్డికి ట్వీట్లు పెట్టు’ అంటూ అయ్యన్నపాత్రుడు ఘాటుగా ప్రతిస్పందించారు. నత్తి పకోడీ… బాబాయ్ పై గొడ్డలి వేటు ఎందుకేశావ్? అని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE