Suryaa.co.in

Editorial

అయ్యో.. జేసీ!

( సుబ్బు)

మాజీ మంత్రి, రాజకీయ భీష్ముడైన జెసి దివాకర్‌రెడ్డి గురించి తెలియని వారుండరు. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఏది మాట్లాడినా చర్చనీయాంశమే. తాడిపత్రి కేంద్రంగా దశాబ్దాలపాటు రాజకీయాలు చేసిన జెసి దివాకర్‌రెడ్డంటే అందరికీ గౌరవమే. ఒకప్పుడు.. ‘‘జగన్ అసలు ఒరిజినల్ రెడ్డి కాదు. మీరంతా మావాడిని రెడ్డి అనుకుంటున్నారు. మా రెడ్లు వీడి లె క్క చేయర’’ంటూ వ్యాఖ్యానించిన అదే జెసి.. టీడీపీ అధినేత చంద్రబాబునుద్దేశించి ‘‘ఇక మీరు మారాలి సార్. శాంతంగా ఉండాలంటే కుదరద’’ంటూ ఆయన ముందే వ్యాఖ్యానించిన సీనియర్ నేత.

ముఖ్యంగా ఏపీ-తెలంగాణ ఉద్యమ సమయంలో జెసి కామెంట్స్ హాట్‌హాట్‌గా ఉండేవి. ‘మేం ఆంధ్రా వాళ్ల రాజకీయాలతో వేగలేం. కాబట్టి మాకు రాయల్ తెలంగాణ ఇవ్వండి. మేం తెలంగాణ వాళ్లతో కలసి బతుకుతాం’ అని ప్రకటించారు. జెసి ఎక్కడుంటే అక్కడ జర్నలిస్టులు మూగిపోయేవారు. ఆయనను కదిలించడం ద్వారా, అనేక సంచలనాలకు కారణమయ్యారు.

హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో జెసి ఉన్నారంటే బోలెడంత సందడి. అయితే సోనియా సహా ఎవరినయినా సులభంగా కలవగలిగేంత స్థాయి ఉన్న జెసి.. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో, ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పాపం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని, తర్వాత పంపించేశారు.

మనసులోని మాటను నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టే అలాంటి జెసి. ఈమధ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన బాగా తెలిసిన వారు సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గుండుతో కనిపిస్తున్న జెసిని, ఆయన తనయుడైన తాడిపత్రి ఎమ్మెల్యే పవన్ చేయిపట్టుకుని నడిపిస్తున్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోను చూసిన ఆయన మిత్రులు, అభిమానులు ఈయన మా జేసీయేనా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు శ్రావణి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన జెసి ఫొటోలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

LEAVE A RESPONSE