Suryaa.co.in

Andhra Pradesh

కాలువల్లో మురుగు, రోడ్లపై చెత్త తొలగించాలి

– ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ

విజయవాడ: విజయవాడ 15వ డివిజన్ పరిధిలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మి నారాయణ పర్యటించారు. వరద నీటిని మోటార్ల సహాయంతో దగ్గరుండి తోడిస్తున్నారు. అలాగే అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తున్నారు. కాలువల్లో మురుగు, రోడ్లపై చెత్త తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బ్లీచింగ్ చల్లాలని, ఫాగింగ్ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో పది వేల మందితో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ప్రతి వార్డు, సచివాలయాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

LEAVE A RESPONSE