Suryaa.co.in

Andhra Pradesh

బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

భైపిసి, ఎంపిసి విద్యార్దులకు స్వల్ప మార్పులతో నిర్దేశిత తేదీలు : నాగరాణి

ఫార్మసీ కళాశాలల అనుమతి పొడిగింపునకు ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో, రాష్ట్రంలోని బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల అడ్మిషన్ షెడ్యూల్ ను సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, ఎపిఈఎపి సెట్ కన్వీనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేసారు. ఎంపీసీ, బైపీసీ అభ్యర్ధులకు వేర్వేరుగా షేడ్యూలు ఉంటుందన్నారు.

ఎంపిసి విద్యార్ధులు నవంబరు ఒకటి నుండి ఎనిమిదో తేదీ వరకు ఆన్ లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ఆన్ లైన్ తో పాటు సహాయ కేంద్రాల వద్ద ధువీకరణ పత్రాల వెరిఫికేషన్ కు నవంబరు 8, 9 తేదీలు కేటాయించామన్నారు. ఐచ్చికాల నమోదుకు నవంబరు 10, 11,12 తేదీలలో మూడు రోజుల పాటు అవకాశం కల్పించామని నాగరాణి వివరించారు. 12 తేదీ ఐచ్చికాల మార్పుకు అవకాశం ఉంటుందని, 14వ తేదీ సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నవంబరు 15, 16 తేదీలలో సీట్లు పొందిన అభ్యర్ధులు అయా కళాశాలల్లో స్వయంగా రిపోర్డు చేయవలసి ఉంటుదన్నారు.

బైపిసి విద్యార్ధులు కూడా నవంబరు ఒకటి నుండి ఎనిమిదో తేదీ వరకు ఆన్ లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవలసి ఉంటుందని, తదుపరి ప్రకియలో మార్పులు ఉన్నాయని కన్వీనర్ తెలిపారు. ఆన్ లైన్, సహాయ కేంద్రాల వద్ద ధృవీకరణ పత్రాల నిర్ధారణకు నవంబరు 9 నుండి 11 వరకు మూడు రోజుల పాటు అవకాశం ఉంటుందన్నారు. నవంబరు 11 నుండి 13 వరకు ఐచ్చికాలను నమోదు చేసుకునేందుకు గడువు ఇచ్చామన్నారు.

ఐచ్చికాల మార్పుకు నవంబరు 14వ తేదీ అవకాశం కల్పించగా, 17వ తేదీ సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నామని చదలవాడ పేర్కొన్నారు. నవంబరు 18 నుండి 21 వరకు బైపిసి విద్యార్ధులు కళాశాలల్లో స్వయంగా రిపోర్డు చేయాలన్నారు. షేడ్యూలు పరంగా బైపిసి, ఎంపిసి విధ్యార్ధులకు ఉన్న తేడాలను గుర్తించి వ్యవహరించాలని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, ఎపిఈఎపి సెట్ ప్రవేశాల కన్వీనర్ వివరించారు.

LEAVE A RESPONSE