Home » కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసి పైశాచిక ఆనందం

కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసి పైశాచిక ఆనందం

గుజరాత్ కంటే తలసరి ఆదాయంలో తెలంగాణ ముందు
24 గంటలు కరెంటు ఇచ్చే కేసీఆర్ ఉండగా కాంగ్రెస్,బీజేపీ మనకు ఎందుకు?
కరీంనగర్ ఎంపీగా ఐదేళ్లలో బండి సంజయ్ ఏం చేసిండో సమాధానం చెప్పాలి
తెలంగాణ వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు లక్షా 30 వేలు
బీజేపీ నేతలు పేపర్ లీకేజీలకు పాల్పడలేదా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు
దరువు ఎల్లన్న చేరిక

రెండు జాతీయ పార్టీలు చేస్తున్న మోసాన్ని గ్రహించి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఉద్యమకారులకు బిఆర్ఎస్ పార్టీ కొంతమేరకు న్యాయం చేసింది…ఇంకా చేయాల్సింది ఉంది. అనేక మంది ఉద్యమకారులు వివిధ పదవుల్లో వున్నారు. ప్రజా కళాకారులుగా వున్న గోరేటి వెంకన్న,దేశపతి శ్రీనివాస్ లను ఎమ్మెల్సీలుగా చేసుకున్నాము. దరువు ఎల్లన్న సేవలను ఉపయోగించుకుంటాము. దరువు ఎల్లన్నకు భరోసాగా వుండే బాధ్యత నాది.

ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది.30 వేల కోట్ల పైచిలుకు మత్స్య సంపదను తెలంగాణలో వుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. పంప్ హౌస్ లు మునిగితే కట్టిన కంపెనీతోనే మరమ్మతులు చేయించి ప్రజలకు నీళ్లు అందించాము. లక్ష్మీ బ్యారేజ్ లో రెండు పిల్లర్లు కుంగితే కేసీఆర్ కమీషన్లు తీసుకున్నాడని విమర్శలు చేశారు. కానీ ప్రజలపై భారం పడకుండా ప్రాజెక్టును కట్టిన కంపెనీతోనే మరమ్మతులు చేయిస్తున్నాం. గుజరాత్ కంటే తలసరి ఆదాయంలో తెలంగాణ ముందు వున్నాం. కర్ణాటక కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ కర్ణాటకలో ఐదు గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్తున్నారు. కర్ణాటకలో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడి కాంగ్రెస్,బీజేపీ నాయకులతో చేతగాక బయటి నాయకులను రప్పించి ప్రచారం చేయిస్తున్నారు. 24 గంటలు కరెంటు ఇచ్చే కేసీఆర్ ఉండగా కాంగ్రెస్,బీజేపీ మనకు ఎందుకు? కరీంనగర్ ఎంపీగా ఐదేళ్లలో బండి సంజయ్ ఏం చేసిండో సమాధానం చెప్పాలి.

కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు 24 వేలు. తెలంగాణ వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు లక్షా 30 వేలు.ఉద్యోగాలు భర్తీ చేయవద్దని ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోర్టుకు వెళ్లలేదా? బీజేపీ నేతలు పేపర్ లీకేజీలకు పాల్పడలేదా? కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం మోదీ ప్రభుత్వం చేస్తుంది. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ అయ్యాయా…? బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తాము.

దళితబంధు పధకం ద్వారా దళితులు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. కేసీఆర్ కు వున్న కమిట్మెంట్ ను చూసి ఓటు వెయ్యండి. కొత్తతరం పిల్లలు కొత్త తరహాలో ఆలోచన చేయాలి. కరువు పీడిత ప్రాంతంగా వున్న పాలమూరులో చేపల చెరువులు,రొయ్యల చెరువులు వచ్చే స్థాయికి ఎదిగాము.

ప్రతి జిల్లాకు మెడికల్ వచ్చింది. అన్నీ చేసిన కేసీఆర్ ను గెలిపిద్దామా…ఏమీ చేయని కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు ఓటు వేద్దామా?

Leave a Reply