ఆప్ జైసా కోయీ..

ఆ రెండు సినిమాల్లో
కీలక పాత్రలను ఖుర్బానీ చేసిన దయావన్..
సినిమాల్లో
మంచి మిత్రులు..
నిజజీవితంలోనూ
చక్కని స్నేహితులూ అయినందుకేమో
మృత్యువూ కలిసే రమ్మంది..
ఒకే తేదీన మరణం..
ఫిరోజ్ ఖాన్..వినోద్ ఖన్నా..
క్యా దోస్తానా..!

ఫిరోజ్ ఖాన్..
ఒక వెరైటీ..ఒక స్టైల్..
నిర్మాణం..దర్శకత్వం..
అదో లెవెల్..
ఇంగ్లీషు యాక్టర్ మాదిరి..
నటనలోనూ టెంపరి..!
ఇతని అభినయం కిక్కే..
అందుకు రుజువు కోటేసిక్కే..
తప్పు చేయని అపరాధి..
పాత్రలు త్యాగం చేసే ధర్మాత్మ..సినిమానే
ఆయన జీవాత్మ..!

వినోద్ ఖన్నా..
ఆరడుగుల అందగాడు..
మల్టీస్టారర్ల స్పెషలిస్టు
అమితాబ్ జతగా
నటనలో హోరాహోరీ..
ఇద్దరూ హేరాఫేరీ..
కలిసి చేస్తూ గుర్రం సవారీ
అంతటి బచ్చన్నే
కాపాడిన దోస్తీ ప్యారీ..
అంతోనీతో జత కట్టిన
అమర్..అక్బర్ తోనూ
విడిగా కాంబినేషన్..
హిట్టు సినిమాల
హాత్ కీ సఫాయీ..
పాసయ్యాడు రాజకీయాల
ఇంతెహాన్..
మధ్యలో రజనీష్
ఆశ్రమవాసం..
కడదాకా కమలంతో
సహవాసం..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply