మొగల్తూరులో 29న కృష్ణంరాజు సంస్మరణ సభ!

-భారీ ఏర్పాట్లు
-28న ప్రభాస్ రాక
-12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈనెల 28న మొగల్తూరు రానున్నారు. రెండు రోజులు స్వగ్రామంలోనే ఉంటారు. 29న ఆయన పెదనాన్న యూవీ కృష్ణంరాజు సంస్కరణ సభతోపాటు , భారీ సమారాధనలో పాల్గొంటారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతోపాటు, 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు విచ్చేస్తుండడంతో వారి నివాసంలో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.

ఇంటికి రంగులతోపాటు లోపల ఫర్నీచర్ను మారుస్తున్నారు. ఐదు రోజులుగా 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నెల 11న కృష్ణంరాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈనెల 23న హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో దశ దిన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కార్డులను మొగల్తూరులోని బంధువులు, స్నేహితులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చాలామంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు 2010లో మృతి చెందినప్పుడు, ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించారు. దిన కార్యక్రమాలను మొగ ల్తూరులో ప్రభాస్ ఏర్పాటు చేసి హాజరయ్యారు. ఇప్పుడు కృష్ణంరాజు సమారాధనకు 50 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply