Home » అన్స్టాపబుల్ మూడో ఎపిసోడ్ ప్లాన్ ఛేంజ్

అన్స్టాపబుల్ మూడో ఎపిసోడ్ ప్లాన్ ఛేంజ్

మరిన్ని సీక్రెట్స్‌తో చంద్రబాబే గెస్ట్‌గా

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ విషయంలో ఓ చిన్న మార్పు చేశారు మేకర్స్. ఈ సారి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గెస్ట్గా వచ్చిన తొలి ఎపిసోడ్కు సంబంధించిన అన్సెన్సార్ వీడియో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు తెలిపారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ జోష్తో ప్రేక్షకులను మజా అందిస్తున్నారు.

ముఖ్యంగా ఓటీటీలో ప్లాట్ఫామ్ ఆహాలో అన్స్టాపబుల్తో అయితే ప్రేక్షకులను ఊపేస్తున్నారు.ఇటీవలే ప్రారంభమైన రెండో సీజన్లో ఇప్పటికే ప్రసారమైన రెండు ఎపిసోడ్లను పూర్తి చేసుకుని వీక్షకులను బాగా ఆకట్టుకుంది. తొలి ఎపిసోడ్లో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, రెండో ఎపిసోడ్లో యంగ్ హీరోలు విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ విచ్చేసి సందడి చేశారు. ఈ రెండు ఆద్యంతం ఆసక్తిగా, ఫన్గా సాగింది.

ముఖ్యంగా ఈ రెండో సీజన్ నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్తో మొదలుపెట్టడంతో వీక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. అందుకు తగ్గట్టుగానే వివాదాస్పద అంశాలపై బాలయ్య ప్రశ్నలు వేయడం.. అందుకు చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది.బావబావమరిది హంగామాగా సాగిన ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే వుంది.

యుక్త వయసులో చేసిన అల్లరి పనుల నుంచి సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విషయాలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న స్నేహం.. ఇలా పలు అంశాల గురించి చంద్రబాబు బయటపెట్టిన తీరు వీక్షకుల్ని ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో మూడో ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

అయితే మేకర్స్ ఈ వారం షోలో కాస్త మార్పు చేశారు. మూడో ఎపిసోడ్ త్వరలోనే వస్తుందని చెప్పిన మేకర్స్.. నేడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆసక్తిగా సాగిన తొలి ఎపిసోడ్కు సంబంధించిన అన్సెన్సార్ వీడియోను స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపారు. మోర్ ఫన్ అండ్ మోర్ సీక్రెట్స్ పేరుతో ఈ ఎపిసోడ్ రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు.
ఇందులో బాబు… బాలయ్యకు ఇంకా ఎలాంటి సీక్రెట్స్ చెప్పారో చూపించబోతున్నారు. కాగా, మూడో ఎపిసోడ్లో సీనియర్ నటి రమ్యకృష్ణ గెస్ట్గా రానుంది. ప్రస్తుతం బాలయ్య షూటింగ్లో బిజీ ఉండటం కారణంగా ఈ ఎపిసోడ్ ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.

Leave a Reply