Suryaa.co.in

Andhra Pradesh

జగన్ మోసం చేశారు బాబూ

చంద్రబాబును కలిసిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు
బలవంతంగా బ్యాంకు అధికారులు సంతకాలు చేయించుకుని అప్పు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆవేదన
ఇళ్లు అప్పగించకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మహిళల కన్నీటి పర్యంతం
తమ ప్రభుత్వం రాగానే టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని చంద్రబాబు హామీ

నిడదవోలు :- టీడీపీ అధినేత చంద్రబాబును నిడదవోలులో గురువారం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు కలిసి సమస్యలను ఏకరవుపెట్టారు. టిడ్కో ఇళ్లు తమకు అప్పగించకపోయినా రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుండి నిత్యం సందేశాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి తాళం అప్పగించేవరకూ రుణాలు అడగబోమని చెప్పి సంతకాలు చేయించుకున్న అధికారులు…ఇప్పుడు రూ.3 లక్షలు కట్టాలంటూ రోజూ ఫోన్లు చేసి వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

బ్యాంకు అధికారులు నిత్యం టార్చర్ పెడుతున్నారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….‘‘పేదవాడికి మంచి ఇళ్లు ఉండాలన్న సంకల్పంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.1.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుండి రూ.1.5 లక్షలతో టిడ్కో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. భూమి, విద్యుత్, రోడ్లు వంటి మౌళిక సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసింది. అధికారంలోకి వస్తే ఉచితంగా ఇళ్లు ఇస్తామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.

కానీ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లుగా ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించకపోగా వాటిపై అప్పులు తెచ్చి భారం మోపారు. మరో నెల రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది….మిగిలిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇంటిని అప్పగిస్తాం’’ అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE