Suryaa.co.in

Andhra Pradesh

హౌసింగ్ లోన్లు కొట్టేసిన ఐపీఎస్ అధికారులు

జగన్ సేవలో తరిస్తున్న డీజీపీ
పోలీసుల ఆత్మ హత్యలకు జగనే కారణం
అధికారం వచ్చిన వెంటనే టీఏ, డీఏ విడుదల
పోలీసుల ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య

జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని… కొంత మంది పోలీస్ అధికారులు జగన్ రెడ్డికి తొత్తులుగా పనిచేయడం వలన.. పోలీస్ సిబ్బంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చి.. పొలీస్ శాఖకు తీవ్ర చెడ్డ పేరు వచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.

మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడుతూ… చేతగాని ముఖ్యమంత్రి, తొత్తుగా మారిన డీజీపీతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్స్, అడిషనల్ లీవ్స్ మరియు టీఏ, డీఏ లను ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలన్నారు. అప్పులు బాధలు తాళలేక చనిపోయిన శంకరావు చావుకు జగన్ రెడ్డే కారణమన్నారు. పోలీసులతో బండ చాకిరి చేయిస్తూ.. కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థ ప్రభుత్వంతో పోలీసు అసోసియేట్ ప్రెసిడెంట్ జనకం శ్రనివాసరావు చేతులెత్తేయడాన్ని గుర్తు చేశారు.

డీజీపీ సిబ్బంది గురించి పట్టించుకోకుండా.. జగన్ సేవలో తరిస్తున్నారని రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. చేతగాని జగ్ రెడ్డి పాలనలో పోలీసు సిబ్బంది ఉగాది, రంజాన్ పండుగలు కూడా చేసుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. పదేండ్లుగా పోలీస్ వ్యవస్థలో ఎటువంటి అప్డేట్ లేదన్నారు. పొలీసులకు సరైన మెడికల్ సేవలు కూడా అందడంలేదన్నారు. హౌసింగ్ కు ఇచ్చే లోన్లను ఐపీఎస్ అధికారులు కొట్టేయడం దారుణమన్నారు. ఇది పెద్ద స్కామ్ అని దానిపై విచారణ చేస్తామని పేర్కొన్నారు.

శంకరావు కుంటుబానికి టీటీడీ సానుభూతి తెలియజేస్తుందని.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుకు టీఏ, డీఏలను విడదుల చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నా…పోలీసులకు టీఏ, డీఏలను వెంటనే విడదుల చేస్తామంటే మేము సహకరిస్తామన్నారు. దానికి చంద్రబాబును అడిగిని మద్దతు తెలుపుతామన్నారు. పోలీసులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. 50 రోజుల్లో టీడీపీ అధికారం వచ్చిన వెంటనే పోలీసుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
సజ్జలకు బుద్ధి జ్ఞానం లేదు.

సజ్జల బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడని.. వాలంటీర్లను బానిసులుగా వాడుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. వాలంటర్లకు పదివేలు ఇస్తే సజ్జలకు ఏం నొప్పో చెప్పాలన్నారు. సజ్జల తీసుకునేది ప్రభుత్వ సొమ్ము… చేసేది జగన్ కు పాదసేవ అన్నారు. త్వరలోనే జే బ్యాచ్ కు శ్రీ కృష్ణ జన్మ స్థానం ఖామయని వర్ల స్పష్టం చేశారు.

 

LEAVE A RESPONSE