Suryaa.co.in

Andhra Pradesh

పూలే స్ఫూర్తితోనే టీడీపీ ఆవిర్భావం

– టీడీపీ అధినేత చంద్రబాబు

ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావ్‌ పూలే. ఆ మహాశయుని స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లోనూ, అధికారంలోనూ ప్రాధాన్యం కల్పించి, బీసీల పార్టీగా పేరుబడింది తెలుగుదేశం. వెనుకబడిన వర్గాలకు ఉపప్రణాళిక తెచ్చిన ఘనత తెలుగుదేశానిదే అని చెప్పుకోగలుగుతున్నామంటే… అందుకు ప్రేరణ పొందింది కూడా ఫూలే ఆశయాల నుంచే.

జ్యోతిరావ్‌ పూలే స్పూర్తితోనే బీసీలకు మరిన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4,000ల పింఛన్ ఇస్తాం…1 లక్ష 50 వేల కోట్ల రూపాయలతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాం… బీసీల స్వయం ఉపాధికి ఐదేళ్ళలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా రూ.5 వేల కోట్ల విలువ చేసే పరికరాలను అందిస్తాం.

చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి, పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతాం .. పెళ్లి కానుక రూ.1 లక్షకు పెంచుతాం… స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం… చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం… బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తాం…. బీసీల కోసం ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఫూలే ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తాం. సమసమాజ స్థాపనకు స్ఫూర్తిప్రదాత, మహాత్మా జ్యోతిరావ్‌ పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.

 

LEAVE A RESPONSE