ఏపీ సర్కార్ ల్యాండ్ , శాండ్ , లిక్కర్ మాఫియా

-కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయకుండా దోచుకుంటున్నారు
-బీజేపీ అధికారంలోకి వస్తేనే పోలవరం
-ఏపీ సర్కారు పై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శలు
-బీజేపీ కి సొంతంగా 370 సీట్లు రావడం పక్కా
-దేశ హితం కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుంది
-ఏలూరులో బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
-మీ నియోజకవర్గాల్లో, మీ బూత్ లలో పని వేగం పెంచాలంటూ రాజ్ నాథ్ సింగ్ ఉత్సాహపూరిత ప్రసంగం

ఈ జనసంద్రం చూస్తే ఏపీ లో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమాగా ఉంది. భారత్ ఏమి చెబుతుందో అని ప్రపంచం అంతా చూసే పరిస్థితి మోడీ తీసుకొచ్చారు. ఒక్క అవినీతి ఆరోపణ లేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి సొంతంగా 370 సీట్లు రావడం పక్కా. ప్రతిపక్షాలు మూడోసారి మోడీ ప్రభుత్వం రాదు అని ఆరోపిస్తున్నారు.

మూడోసారి మాత్రమే కాదు, నాలుగో సారి కూడా మోడీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. మూడో సారి అధికారంలోకి వస్తే వికసిత్ భారత్ ను మోడీ సారధ్యంలో చూస్తారు. అధికారం కోసం కాదు, దేశ సేవ కోసం, దేశ హితం కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుంది. దేశంలో 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు.

కోట్ల మంది పేదలకు సొంత ఇళ్ళు, మరుగుదొడ్లు, వైద్యం, చిరు వ్యాపార అభివృద్ధి అన్నీ మోడీ హయాంలోనే జరిగింది. 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ లో కలిపింది మనమే. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి చూపించింది మనమే. అయోధ్య శ్రీరామ మందిరం నిర్మించింది మనమే.

.2022 నాటికి ప్రపంచంలో ఆర్ధిక వ్యవస్థ లో భారత్ 5వ స్థానంకు మోడీ తీసుకొచ్చారు. 2027 కల్లా ప్రపంచంలో మూడో స్థానానికి భారత్ ను తీసుకెళ్లబోతున్నాం. చంద్రయాన్ 1, 2 ఫెయిల్ అయినా, చంద్రయాన్ 3 సక్సెస్ చేసేలా మోడీ ప్రోత్సాహం ఉంది. గగన్ యాన్, చంద్రయాన్ లను మనం లాంచ్ చేసాం. కానీ, కాంగ్రెస్ రాహుల్ గాంధీ ను లాంచ్ చేయడంలో విఫలం అవుతూనే ఉంది. ఎవరైనా భారత్ వైపు కన్నెత్తి చూస్తే సరిహద్దు దాటి వెళ్లి సమాధానం చెప్తాం అని నిరూపించాం.

ఏపీ సర్కార్ కు రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని లేదు. కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయకుండా దోచుకుంటున్నారు. ఏపీ సర్కార్ ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లో మునిగిపోయింది. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కోసం మోడీ తలచే వరకూ పట్టించుకున్నవారు లేరు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవనుంది. పోర్టులు, హైవే లు వల్ల ఏపీ లో పెట్టుబడులు వచ్చి ఉపాధి పెంచేలా కేంద్రమే పని చేసింది. కేంద్రం జల జీవన్ మిషన్ కు రూ.4 వేల కోట్లు ఇస్తే ఏపీ మాత్రం పేదలకు త్రాగునీరు ఇచ్చే పని చేయలేదు. ప్రతి కార్యకర్త బీజేపీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బూత్ కార్యకర్తలు ప్రతీ లబ్దిదారుని వద్దకు వెళ్లి మోడీ నమస్కారం పెట్టమన్నారు అని పెట్టి రండి.

ప్రతీ కొత్త ఓటర్ల వద్దకు వెళ్లి బీజేపీ అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించండి. ఎందుకు బీజేపీ కావాలి..? అంటే అవినీతి నిర్మూలనకు, దుష్టుల గుండెల్లో భయం పుట్టడానికి బీజేపీ కావాలి. పెట్టుబడులు రావాలన్నా, అభివృద్ధి కావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాలి. రైతు, మహిళ, నిరుద్యోగి, శ్రామికుడు, ప్రతీ ఒక్కరికీ మేలు జరగాలంటే బీజేపీ రావాలి. అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించాలంటే దేశంలో బీజేపీ రావాల్సిందే.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి, సైన్యంలో మహిళా నియామకం చేసింది బీజేపీ యే. 2022 నాటికి ప్రపంచంలో ఆర్ధిక వ్యవస్థ లో భారత్ 5వ స్థానంకు మోడీ తీసుకొచ్చారు. 2027 కల్లా ప్రపంచంలో మూడో స్థానానికి భారత్ ను తీసుకెళ్లబోతున్నాం. చంద్రయాన్ 1, 2 ఫెయిల్ అయినా, చంద్రయాన్ 3 సక్సెస్ చేసేలా మోడీ ప్రోత్సాహం ఉంది.

గగన్ యాన్, చంద్రయాన్ లను మనం లాంచ్ చేసాం. కానీ, కాంగ్రెస్ రాహుల్ గాంధీ ను లాంచ్ చేయడంలో విఫలం అవుతూనే ఉంది. ఎవరైనా భారత్ వైపు కన్నెత్తి చూస్తే సరిహద్దు దాటి వెళ్లి సమాధానం చెప్తాం అని నిరూపించాం.

Leave a Reply