అన్నాక్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టిన ముఖ్యమంత్రి

– మధ్యాహ్నభోజనానికి మంగళంపాడి, విద్యార్థుల కడుపులు మాడుస్తున్నాడు
• విద్యార్థులఆకలికేకలు, మధ్యాహ్న భోజననిర్వాహకుల వెతలు ముఖ్యమంత్రికి పట్టడంలేదు
• కోడిగుడ్లు, పాలుసరఫరాచేసేవారితోపాటు, వంటలువండేవారికి కూడా ఈప్రభుత్వం రూ.250కోట్లు బకాయిపెట్టింది
• విద్యాభ్యాసంలో డ్రాపవుట్స్ సంఖ్య తగ్గించి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడానికి చంద్రబాబునాయుడు గారు విద్యార్థులకోసం మధ్యాహ్నభోజనం పథకం తీసుకొచ్చారు
• అంత గొప్ప పథకాన్నీనీరుగార్చిన ఈముఖ్యమంత్రి 43లక్షల పైచిలుకు విద్యార్థులను పస్తులుంచుతున్నాడు
• నాడు చంద్రబాబునాయుడి హయాంలో విద్యార్థుల కడుపునిండితే, నేడు జగన్ జమానాలో విద్యార్థులు ఆకలితోచావడమేనా ఈప్రభుత్వం తీసుకొచ్చిన నాడు-నేడు
• విద్యార్థులు, వారితల్లిదండ్రులు, మధ్యాహ్నభోజన నిర్వాహకులు రోడ్డెక్కకముందే ముఖ్యమంత్రి మేల్కొంటే మంచిది
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ
అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అన్నీరద్దుచేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఇదివరకే అన్నాక్యాంటీన్లు మూసేసి పేదలకడుపులు మాడ్చాడని, ఇప్పుడు పేదవిద్యార్థుల కడుపునింపే మధ్యాహ్నభోజనం పథకాన్నికూడా రద్దుచేసేదిశగా వెళ్తుతున్నాడని, కోడిగుడ్లుసరఫరాచేసేవారికి రూ.110కోట్లు, పాలసరఫరాదారులకు రూ.130కోట్లు, వంటలు వండేవారికినెలకు ఇచ్చే రూ.3వేలను 2020నుంచి ఇప్పటివరకు చెల్లించలేదని, వంట ఏజెన్సీలకు రూ.250కోట్లవరకు ప్రభుత్వంబకాయిఉందని, ఇవన్నీచూస్తుంటే, ఈ ప్రభుత్వం పూర్తిగా మధ్యాహ్నభోజనానికి మంగళంపాడేట్టుగా కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర్రఅధికార ప్రతిని ధి సయ్యద్ రఫీ తెలిపారు.సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
నవరత్నాలు అమలుచేస్తున్నాం కాబట్టి, పిల్లలంతా తింటేతినండి…లేకపోతే పస్తులుండండి అన్నట్లుగా ముఖ్యమంత్రి వైఖరిఉంది. చంద్రబాబునాయుడుగారు 2003లో మధ్యాహ్నభోజ నం పథకాన్ని తీసుకొచ్చారు. అప్పటినుంచి ఎన్నిప్రభుత్వాలుమారినా, నిరాటంకంగా రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షలమందివిద్యార్థుల కడుపునిండుతోంది. అదేచంద్రబాబుగారు తిరిగి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నభోజనాన్ని అమలుచేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కవిద్యార్థికి గుప్పెడుమెతుకులు అందనిదుస్థితి. మధ్యాహ్నభోజన నిర్వాహకుల తాలూకా సమస్యలు, విద్యార్థులఆకలికేకలు ఈ ప్రభుత్వానికి, మంత్రులకు కనిపించడంలేదా.. వినిపించడంలేదా అని ప్రశ్నిస్తున్నాం.
ఇప్పటికే పెరిగిననిత్యావసరాల ధరలు, కూరగాయలధరలతో భోజననిర్వాహకులు చేతులెత్తేశారు. ప్రభుత్వం సకాలంలో వారికి బకాయిలుఇవ్వకుండా వేధిస్తుండటంతో, వారిపరి స్థితి మరింత దీనంగా తయారైంది. గిరిజన పోషణ పథకంలో భాగంగా చంద్రబాబునాయుడు గారిహయాంలో అప్పుడే పుట్టిన బిడ్డ

లు, తల్లులకు, బాలింతలకు కూడా పౌష్టికాహారం అందించారు. ఫుడ్ బాస్కెట్ వంటి వాటివి గతప్రభుత్వంలో సకాలంలో తల్లీబిడ్డలకు అందేవి. ఈ ముఖ్యమంత్రి వచ్చాక అదికూడా ఆగిపోయింది. అప్పుడే పుట్టినచిన్నారులు మొదలు ఇంటర్మీడియట్ విద్యార్థులవరకు అందరికీ, జగన్మోహన్ రెడ్డి ఆకలికేకలే మిగిల్చాడు.
నాడు-నేడు పథకం పేరుతో వందల కోట్లను ప్రచారానికి తగలేశారు. మధ్యాహ్నభోజనం నిర్వాహకులకు బిల్లులు ఇవ్వడానికి మాత్రం డబ్బుల్లేవంటున్నారు. కేంద్రగణాంకాలప్రకారం రాష్ట్రంలో మధ్యాహ్నభోజనం అందిస్తున్న విద్యాసంస్థలు 45,484 వరకుఉంటే, విద్యార్థులు 42.70లక్షలమంది ఉన్నారు. మధ్యాహ్నభోజనం అమల్లో 1 నుంచి 8వ తరగతివరకు చదివేవిద్యార్థులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 60:40నిష్పత్తిలో అమలు చేస్తుంటే, 9, 10తరగతి విద్యార్థులకు మొత్తంగా రాష్ట్రప్రభుత్వమే భరిస్తోంది.
ప్రాథమికపాఠశాలల్లో మధ్యాహ్నభోజనంకోసం ఒక్కోవిద్యార్థికి రూ.4.97పైసలు ప్రభుత్వం భోజననిర్వాహకులకుచెల్లిస్తోంది. అలానే ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరి కి రూ7.45పైసలు వంతునచెల్లిస్తున్నారు. వంటనిర్వాహకులకు గౌరవవేతనంగా నెలకు రూ.3వేలు చెల్లించాల్సి ఉంది. వీటన్నింటినీ జగన్ ప్రభుత్వం గాలికివదిలేసింది. విద్యాభ్యాసంలో డ్రాపువుట్స్ సంఖ్యను తగ్గించడానికి చంద్రబాబునాయుడు గారి హయాంలో పూర్తిపౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలుచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డిప్రభుత్వంలో మధ్యాహ్నభోజనం అధ్వాన్నంగా తయారై అటకెక్కేదుస్థితి. ఇదేనా ఈ ముఖ్యమంత్రి అమలుచేసిన నాడు- నేడు.
వంటచేసేవారికి ఇచ్చే జీతాలను పెంచుతూపోతానన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు అసలు పూర్తిగా సంవత్సరంనుంచి వారికి రూపాయి ఇవ్వడంలేదు.జగన్మోహన్ రెడ్డి, మధ్యాహ్నభోజనపథకాన్ని ఎంతత్వరగా పునరుద్ధరిస్తే అంతమంచిది. లేకుంటే అర్థాకలితో అలమటిస్తున్న విద్యార్థులు, వారితల్లిదండ్రులు రోడ్డెక్కే రోజువస్తుంది. ఈ ముఖ్యమంత్రికి ఏదీ సౌమ్యంగా చెబితే చెవికి ఎక్కడంలేదు. విద్యార్థులు రోడ్డెక్కి, ఆయనచెవు ల పగిలేలా సమాధానం చెప్పాల్సిందే.
మధ్యాహ్నభోజనం పథకంఆగిపోతే, విద్యార్థులకు ఎన్నిఅవస్థలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పకపోతేఎలా? ప్రజలు కట్టే పన్నులసొమ్ముని కూడా పేదవిద్యార్థుల కడుపునింపడానికి ఉపయోగించలేని ఈప్రభుత్వం ఉంటే ఎంత…లేకపోతే ఎంత? ముఖ్యమంత్రి తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా అన్నిప్రభుత్వపాఠశాల ల్లో మధ్యాహ్నభోజనం అందేలాచేయాలని కోరుతున్నాం. అలానే భోజననిర్వాహకులకు, కోడిగుడ్లు, పాలసరఫరాదారులు, వంటపనివారికి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాల ని తక్షణమే రూ.1000కోట్లను విడుదలచేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తున్నాం.