Suryaa.co.in

Entertainment

రిషి..కిసీసే కమ్ నహీ…

హమ్ తుమ్ ఎక్ కమ్రే మే
బంద్ హో..
ఔర్ చాభీ ఖోజాయే..
ఈ పాట..
అందాల బొమ్మ బాబీ..
జతగా రాజా..
బాండ్ బాజా..!

రిషి కపూర్..
ఆ చాక్లెట్ ఫేస్..
టీనేజ్ సెన్సేషన్..
మెషాయర్ తో నహీ..
మగర్ ఏ హసీ..
జబ్ సె దేఖా..
మైనే తుజ్ కో
ముజ్ కో..
షాయరీ ఈ ఆగయా..!
అనాటి ఆడపిల్లల
కలల రాకుమారుడు..
కపూర్ ఖాందాన్ నుంచి
మెరుపులా వచ్చిన
బాలాకుమారుడు..
కెరీర్ మొత్తం ఖేల్ ఖేల్ మే
హిట్లు కొట్టడంలో
హమ్ కిసీసే కమ్ నహీ..!

పొట్టి ఫ్రాకుల డింపుల్
బాబీగా కుర్రకారు
మతులు పోగొడితే..
డింపుల్ కంటే సింపుల్ గా
డ్రీమ్ బాయ్ కి
ఒక సేంపుల్ గా…
రిషి ఒక సంచలనం..
ముగ్గురు తండ్రుల సంకలనం!

తొలి రోజుల్లో ముద్దపప్పు..
మేరా నామ్ జోకర్లో
చేసి ఒక తప్పు..
బాబీలో ప్రేమ సామ్రాట్టు..
ఈ చింటు..ప్రేమకి బంటు..
అటుపై కాలేజీ స్టూడెంటు..
డాన్సింగ్ స్టార్ గా ప్రమోషన్..
చింటూ చిందేస్తే
థియేటర్లు అదిరె..
చల్ మెరే భాయ్ అంటూ గెంతితే అంతటి
ఆమితాబుకే
కళ్ళు చెదిరె..!
ఆరడుగుల నటులు
అమితాబ్..వినోద్ ఖన్నా
ఆందోనీ..అమర్ అయితే
ఈ కురస కుర్రాడు
అక్బరై అదరగొట్టాడు!

వారసత్వం..
ఇంటినిండా యాక్టర్లే…
వాళ్ళలో వారికే పోటీ…
అందగాళ్ళయినా పిటీ..
అందరికీ ఒబేసిటీ..
అయినా ఏలేసారు
ముంబై సిటీ..!

రిషి..
పసి వయసు ఖుషి,.
ప్రేమ రుషి..
ఒళ్లు ముదిరి గంతులు
వెయ్యలేని భారీ మనిషి..
రోగం ఇబ్బంది పెట్టినా
శరీరం ముబ్బడి అయినా
ఈ క’పూర్’..
అభినయంలో ఎప్పుడూ రిచ్
ఈ కింగ్ జీవితం
నీతూ సింగ్ జతగా
చివరి వరకూ స్వింగ్…!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE