Suryaa.co.in

Andhra Pradesh

న్యాయస్థానాలను గౌరవించని జగన్ న్యాయమూర్తుల సదస్సుకా?

– జగన్ నిందితుడు కాకున్న ముద్దాయే
– ఇప్పటికే జగన్ సర్కారుపై కోర్టు అక్షింతలు
– న్యాయమూర్తుల సదస్సుకు జగన్ హాజరుపై ఎంపీ రఘరామ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న సీఎం జగన్, న్యాయమూర్తుల సదస్సుకు హాజరడంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా సీఎం జగన్ ప్రస్తుతం నిందితుడు కాకపోయినా ముద్దాయి. ప్రభుత్వంపై కోర్టులు రోజూ అక్షింతలు వేస్తున్నాయి. ఇప్పటికి 200 పైచిలుకు వ్యతిరేక తీర్పులు ఇచ్చాయి. ఈ పరిస్థితిలో ఆయన న్యాయమూర్తుల సదస్సుకు హాజరుకావడం విస్మయం కలిగిస్తోంది.జగన్‌పై నేను వేసిన పిటిషన్లు విచారణకు ఆలస్యం అవుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు.

న్యాయస్థానాలను గౌరవించని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తుల సదస్సుకు హాజరు కావడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. జగన్ సర్కారును 180 నుంచి 200 పైచిలుకు సార్లు కోర్టులు మొట్టికాయలు వేశాయన్నారు. జగన్ బెయిల్ రద్దుపై తాను వేసిన పిటిషన్ విచారణ ఆలస్యంపై రఘు రామ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్ ప్రస్తుతం ముద్దాయి మాత్రమేనని నిందితుడు కాదన్నా ఆయన, అన్ని కేసుల నుంచి ఆయన పూర్తిగా బయట పడాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇదే విధంగా తాను వేసిన బెయిలు రద్దు పిటిషన్ విచారణ కొనసాగితే, తుది విచారణకు మరో ఐదారేళ్ల సమయం పట్టి అవకాశం లేకపోలేదన్నారు.

మరిన్ని అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని వై ఎస్ ఆర్ సి పి, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఛాలెంజ్ గా తీసుకొని క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. ఎవరైనా విమర్శలు చేసినప్పుడు, ప్రతి విమర్శలు చేయడం కరెక్టు కాదని , ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు కేటీఆర్ ను రఘు రామ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలే లేవని పెద్ది రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ… అవును నిజమే రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, అసలు కరెంటు సరఫరా ఉంటే కదా కోతలనేవి ఉండేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా జగన్ మంత్రివర్గ సహచరులు సంకుచిత స్వభావం నుంచి బయటకు వచ్చి వాస్తవాలను అంగీకరించాలని హితవు పలికారు.

ఏపీలో కరెంటు కష్టాలన్నీ మానవ తప్పిదమే నన్న రఘురామకృష్ణంరాజు, ప్రభుత్వ పెద్దలు కోల్ స్టోరేజ్ లను మూసివేసి, వాటిని విక్రయించాలని చూసింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభమే కూల్చివేత లతో స్టార్ట్ అయిందని, ఇక నిర్మాణాలను ఎక్కడ చేపట్టగల దంటూ విమర్శించారు.

నిర్మాణాలు చేపట్టడమే అభివృద్ధా? అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించడం పై రఘురామ తనదైన శైలిలో స్పందిస్తూ… ప్రభుత్వ ఆస్తుల్ని, ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేయడమే అభివృద్ధా? అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించడం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు. కరోనా బిల్లులను కూడా చెల్లించ లేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు.

బీటెక్ విద్యార్థి నీ అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడడం అభినందనీయమన్న రఘురామ, దానికి లేని దిశ చట్టం ను కారణంగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో దిశా చట్టం లేకపోయినా, 20 రోజుల్లోనే నిందితులను శిక్షించారన్న విషయాన్ని గుర్తు చేశారు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలన్న రఘురామ, అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై రాళ్ల దాడి చేసిన సంఘటనలను పరిశీలిస్తే, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE