Suryaa.co.in

Andhra Pradesh Entertainment

దిగుమతి చేసుకునే బొగ్గపై సెస్ ను రద్దు చెయ్యాలి.

– బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటా రు
– ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎంపీ
విజయసాయిరెడ్డి

ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే బొగ్గు, కోక్ (నాణ్యమైన బొగ్గు)పై టన్నుకు రూ.400 చొప్పున వసూలు చేస్తున్న సెస్ ను, పరిస్థితి మెరుగుపడే దాకా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పలు అంశాలపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.

సెస్ ను రద్దు చెయ్యడం వల్ల ధర్మల్ కేంద్రాలు, ఉక్కు, ఇతర బొగ్గు ఆధారిత పరిశ్రమల్లో ఉత్పత్తి వ్యయం కాస్త అదుపులోకి వస్తుందన కేంద్రానికి సూచించారు. ట్విట్టర్ వేదికగా సిని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారని అది వారి భ్రమగానే మిగిలిపోతుందని అన్నారు. బండ్ల గణేష్ ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు నని అన్నారు.

 

LEAVE A RESPONSE