మానవత్వం చాటుకున్న ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

– రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన సొంత వాహనంలో తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్పించిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ లంకెలపాలెం నుండి అనకాపల్లి వైపు వెళ్తుండగా.. మార్గ మధ్యంలో నేషనల్ హైవేపై జరిగిన బైక్ ప్రమాదాన్ని గమనించి,వెంటనే అక్కడకు వెళ్లి ..ప్రమాదం జరిగిన వ్యక్తులను మినిస్టర్ కారులో , దగ్గర ఉన్న అనకాపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేసి గాయపడిన వ్యక్తులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. అక్కడే ఉన్న స్థానికులు గౌరవ మంత్రి . గుడివాడ అమర్నాథ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Leave a Reply