Suryaa.co.in

Andhra Pradesh

జోరు వానలోనూ ఆగని లోకేష్ పాదయాత్ర

– యాత్ర నిలిపివేయాలన్న టీడీపీ నేతలు
– కుదరదని ముందుకు సాగిన లోకేష్
– గొడుగులు కూడా వద్దని వారించిన యువనేత
– వానలోనూ లోకేష్‌ను చూసేందుకు వచ్చిన జగన్

టీడీపీ యువనేత నారా లోకేష్ మొక్కవోని పట్టుదల, దీక్షతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. యువగళం పేరుతో లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చేరింది. నందవరంలో పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో, భారీ వర్షం మొదయిలంది. అయితే వర్షం ఉన్నందున పాదయాత్ర నిలిపివేసి, విశ్రాంతి తీసుకోవాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. దానికి నిరాకరించిన లోకేష్.. ఒకసారి పాదయాత్ర ప్రారంభమైన తర్వాత, మధ్యలో నిలిపివేసే సమస్యే లేదని స్పష్టం చేశారు. కనీసం గొడుగుతోనయినా పాదయాత్ర చేయమన్న వారి సూచననూ, తిరస్కరించి ముందుకు కదిలారు. కాగా భారీ వర్షంలో కూడా జనం లోకేష్‌ను చూసేందుకు, కదలకుండా నిలబడటం విశేషం. ముఖ్యంగా మహిళలు చాలాసేపు వర్షంలో లోకేష్ కోసం ఎదురుచూశారు.

LEAVE A RESPONSE