రైతుకు మేలు చేయడమే లక్ష్యం: మంత్రి కొట్టు

రైతులకు అన్ని విధాల మేలు చేసే విధంగా వైఎస్సార్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆదివారం తాడేపల్లిగూడెం కుంచన పల్లిలో రైతు భరోసా కేంద్రం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోరి ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయం తో పాటు రైతు భరోసా కేంద్రం నిర్మించి ఆ కేంద్రంలో రైతులకు అవసరమైన అన్ని సేవలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు అవసరమైన ఎరువులు , పురుగుమందులు , విత్తనాలు సరసమైన దరలకు నాణ్యమైనవి అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

రైతుకు ఏ విధమైన కష్టం కలగకుండా రైతు పండించిన ధాన్యాన్ని రైతుల వద్ద గిట్టుబాటు ధర కు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దాన్యం డబ్బులు నేరుగా 21 రోజులలోగా రైతుల బ్యాంకు అకౌంట్ లోకి డబ్బులు జమ అవుతాయని ఆయన తెలిపారు. రైతులకు అన్ని విధాలా మేలు చేసే విధంగా దళారీ వ్యవస్థను నిర్మూలించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి , ఆర్డీవో దాసి రాజు , జిల్లా అధికారులు , తాడేపల్లిగూడెం జడ్పిటిసి ముత్యాల ఆంజనేయులు , పెంటపాడు జడ్పిటిసి వరలక్ష్మి , వ్యవసాయ శాఖ అధికారులు , తదితరులు పాల్గొన్నారు .

 

Leave a Reply