అమర దీపం

భక్తులకు భక్తకన్నప్పగా..
ప్రేమికులకు
అమరదీపంగా..
యువతకు
కటకటాల రుద్రయ్యగా….
పెద్దలకు బొబ్బిలి బ్రహ్మన్నగా..

చిరకాలం గుర్తుండిపోయే పాత్రల్లో
ఎప్పటికీ
జీవించిపోయేలా నటించి
శాశ్వతంగా ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానాన్ని
సంపాదించుకున్న రెబల్ స్టార్…!!

కథానాయకుడుగా
సినీరంగ ప్రవేశం చేసి…
పరాజయాల్ని ఎదుర్కొని
ప్రతినాయకుడిగా ,
సహాయ నాయకుడిగా
కొనసాగుతూ….
మరలా తనకు తానే
కధానాయకుడుగా
ప్రతిష్టించుకున్న
స్ఫూర్తిదాయకమైన ప్రయాణం
నట రాజసం జీవితం…!!

సుతిమెత్తని కంఠంతో
జానకి కత్తి అందుకో అంటూ
వీర రసాన్ని వెండితెరపై
సరికొత్తగా ఆవిష్కరించిన
రౌద్రానికి రారాజు…!!

స్నేహితుల కోసం
చాచిన హస్తమై..
నిర్మాతగా మారి …
ఎన్నో విజయవంతమైన
చిత్రాలను నిర్మించిన
మనసున్న మారాజు…!!

సమస్యతో
ఏ సంబంధం లేకున్నా..
పెద్దరికంతో చొరవచూపి
పరిష్కార మార్గానికి
బాటలు వేసిన
ఆదర్శ రారాజు…!!

సుదీర్ఘ సినీ ప్రయాణంలో
తోటి అగ్రతారలతో
తెర పంచుకోవడంలో
ఎప్పుడు ముందుండి…
విలక్షణమైన నటనతో
ఇంటిల్లిపాదికి చేరువైన
వెండితెర రారాజు…!!

రాజకీయాల పరంగా
ఖ్యాతి అనల్పమే అయినా ..
పదవి ఉన్నా లేకున్నా …
నిబద్ధత కలిగి…
భాజపా అభివృద్ధికి కృషి చేసిన
అజాతశత్రువు…!!

తరతరాల
సంప్రదాయ వైద్యంగా
ఆయుర్వేదం..
హోమియోపతిని సైతం వాడుతూ ప్రచారకర్తగా వ్యవహరించిన
నిరాడంబరుడు…!!

నిండైన వ్యక్తిత్వం,
గాంబీర్యమైన స్వరంతో
సినీ ,రాజకీయ రంగంలో
చెరగని ముద్ర వేసి…
మరలి రాని లోకాలకు
తరలిపోయినా….
అభిమానుల హృదయాల్లో
“అమర దీపమే”…!!

– నలిగల రాధికా రత్న

Leave a Reply