మధురమైన పాటకు ఆచూకి జానకి

అలసిపోతే కోయిలమ్మ
కోసం వెతికి వెతికి..
ఇదిగో నా గొంతులో
దాగి ఉందని
గుట్టు చెప్పే ఎలకోకి..
జానకి..

సిరిమల్లె పూవల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వు
అనగానే తేనెలు
కురిపిస్తూ నవ్వే* *బహుముఖి..
జానకి..

దివిలోని గంధర్వ గానానికి
భువిలోన ఉనికి..
జానకి..

స్వరాలను నాట్యమాడించే
సరాగాల కేకి..
జానకి..

ఈ దుర్యోధన దుశ్శాసన
దుర్నిరీతి లోకంలో..
అంటూ నిప్పులు
కురిపించిన చెకుముకి
జానకి

నీలి మేఘాలలో
గాలి కెరటాలలో
నీవు పాడే పాట
వినిపించు నేడీవేళ..
ఇలా దేవగానాన్నే ఇలకు* *దింపిన మధుర గాయకి..
జానకి..

పాటకు సుశీల..
ఆటకు ఎల్లారీశ్వరి..
అల్లరికి జిక్కి..
వల్లరికి రమోలా..
పసిపాప కేరింతకు వసంత..
భక్తికి లీల..
అమ్మాయికి వాణి జయరామ్..
అమాయకత్వానికి జమునారాణి..
ఈ రసాలన్నిటి కలగలుపు..
లేత మామిడి పులుపు..
మధురసం..
అందమైన దరహాసం..
సినిమా పాటల ప్రపంచంలో
చెరిగిపోని లేఖి..
మన జానకి..
మధుర గాయని జానకి
జన్మదిన శుభాకాంక్షలతో..

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply