Suryaa.co.in

Entertainment

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూత

హైదరాబాద్ : శివశంకర్ మాస్టర్(72) అనారోగ్యంతో కన్నుమూశారు.కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు శివశంకర్ మాస్టర్.ఇటీవల కరోనా భారినపడ్డ శివశంకర్ మాస్టర్ కుటుంబం ..కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది.  ఆయన హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.కరోనాతో పోరాడుతున్న శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్.ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు.శివశంకర్ మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చెనైలో 7 డిసెంబర్ 1948లో పుట్టిన శివశంకర్ .శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి.
1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా పనిచేసిన శివశంకర్ మాస్టర్.భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చిన శివశంకర్ మాస్టర్.800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన శివశంకర్..దాదాపు 30 చిత్రాల్లో నటించిన శివ శంకర్ మాస్టర్.
2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్న శివశంకర్ మాస్టర్.శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన చిత్రాలు: అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్

LEAVE A RESPONSE