Suryaa.co.in

Andhra Pradesh

కొడాలి నాని ఇలాకాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా

– అధికారిపై దాడి చేసిన వారిపై చర్యలకు బదులు రాజీ చేయిస్తారా?
– గుడివాడలో మైనింగ్ మాఫియా ను అడ్డుకునేందుకు యత్నించిన ఆర్.ఐ అరవింద్ పై దాడి ఘటనపై గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి లేఖ రాసిన తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాల తో రాష్ట్రంలో సహజ వనరులు దుర్భర దశకు చేరుకున్నాయి. మైనింగ్ మాఫియా అన్ని పర్యావరణం నిబంధనలను ఉల్లంఘిస్తూ నిరంతరం సహజ వనరులను కొల్లగొడుతున్నారు. మైనింగ్ మాఫియా కారణంగా జీవావరణం దెబ్బతిని రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంధకారమౌబోతోంది.

మైనింగ్ మాఫియా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరవింద్‌ను జేసీబీతో హతమార్చేందుకు ప్రయత్నించారు. అడ్డుతోలగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. భౌతికంగా దాడి చేశారు.

మాజీ మంత్రి కొడాలి నాని బహిరంగ మద్దతుతో గుడివాడలో అక్రమ మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. ఆర్‌ఐపై దాడి జరిగినా మైనింగ్ అధికారులు మాఫియాపై చర్యలు తీసుకోకుండా రెవెన్యూ అధికారులతో రాజీ కుదిర్చారు. మీరు గనులు శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోకపోవడం చాలా భయంకరం.

మీ ఆశీస్సులతోనే రాష్ట్రంలో విచక్షణారహితంగా అక్రమ మైనింగ్‌ కొనసాగుతోందన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అక్రమ మైనింగ్ ఇలాగే కొనసాగితే సహజ వనరులు దెబ్బతిని మన పిల్లలు నష్టపోతారు. భావి తరాలు మనల్ని క్షమించవు. కాబట్టి మైనింగ్ మాఫియా పై, ఆర్. ఐ అరవింద్‌పై దాడి చేసిన దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.దోషులపై సత్వర చర్యలు మాత్రమే అక్రమ మైనింగ్ మాఫియాను అరికట్టి ప్రకృతి మాతను రక్షించడంలో సహాయపడుతుంది. మంత్రిగా మైనింగ్‌ మాఫియా పై చర్యలు తీసుకునేందుకు ఇది మీకు ఒక మంచి అవకాశం.

LEAVE A RESPONSE