Suryaa.co.in

Entertainment

భీమ్లా నాయక్ సినిమా బాగానే ఉంది. కానీ..

భీమ్లా నాయక్ సినిమా చూశాను.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కేవలం ఒక సినిమా నటుడిగా చూస్తే…. సినిమా బాగుంది… చాలా బాగుంది.
ప్రధాన పాత్రధారులు ఇద్దరూ పోటీపడి నటించారు.
మాటలు, పాటలు, ఫైట్స్… బాగున్నాయి.
సినిమాలో కామెడీ లేకపోయినా… స్క్రీన్ ప్లే లో ఉన్న పట్టు వల్ల, కామెడీ లేని లోటు ఎక్కడా కనిపించలేదు.

జస్టిస్ చౌదరి, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి…. పేర్లు మాత్రమే కనిపించే తెలుగు సినిమాల్లో…. భీమ్లా నాయక్…. అనే పేరుని, పవన్ కళ్యాణ్ లాంటి ఒక మాస్ హీరో నటించిన కమర్షియల్ సినిమాకి పెట్టడం …. నిజంగా అభినందించదగ్గ విషయం…. ఇంకా గట్టిగా చెప్పాలంటే… విప్లవాత్మకం.

ముందే చెప్పినట్టు…. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని, ఒక మాస్ హీరోగా మాత్రమే చూస్తే… ఈ సమీక్ష సరిపోతుంది.

కానీ…. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…. కేవలం సినిమా హీరో మాత్రమే కాదు.
ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు. పైగా ఆ పార్టీ పేరు జనసేన. చట్టసభ సభ్యుడు కాకపోయినా, జగన్ ప్రభుత్వం పై పోరాడుతున్నట్టు చెప్పుకుంటున్న, గణనీయమైన యువత మద్దతు ఉన్న రాజకీయ నాయకుడు.

మరి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు… విపరీతమైన క్రేజ్ ఉన్న మాస్ హీరో అయితే…. అది కూడా… ఒక అవినీతి ప్రభుత్వంపై, అరాచక ప్రభుత్వం పై, సమాజంలోని వివిధ వర్గాలు, వివిధ సమస్యలపై పోరాడుతున్నప్పుడు….. అలాంటి అంశాల ప్రస్తావన లేకుండా…. సినిమా రావడం… ఆలోచించాల్సిన విషయమే.

పవన్ కళ్యాణ్ సామాజిక స్పృహ ఉన్న, బాధ్యతాయుతమైన వ్యక్తి.
కళ కళ కోసం కాదు…. కళ ప్రజల కోసం. అని బళ్లారి రాఘవ చెప్పిన మాట… సాహిత్యాభిలాష అయిన పవన్ కళ్యాణ్ కు తెలిసే ఉంటుంది.

కాబట్టి…
ఒక సగటు సినిమా ప్రేక్షకుడిగా….
ఒక ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా….
ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న అరాచక పాలన పోరాడుతున్న వారిలో ఒకరి గా…
సినిమా లాంటి బలమైన మాధ్యమం ద్వారా… పవన్ కళ్యాణ్ లాంటి సినిమా హీరో కమ్ రాజకీయ నాయకుడు…. రాబోయే రోజుల్లో అయినా….. వర్తమాన సామాజిక, రాజకీయ అంశాలను స్పృశిస్తూ…. సినిమాలు తీయాలని, సందేశాత్మక చిత్రాలు ద్వారా, సామాజిక రాజకీయ మార్పుకు వారధి కావాలని… కోరుకుంటున్నాను.

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE