Suryaa.co.in

Entertainment

మేనత్త కుటుంబాన్ని పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్

మూడు రోజుల క్రితం మరణించిన తన మేనత్త ఉమామహేశ్వరి కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు. సతీసమేతంగా వెళ్లి.. మేనత్త కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. నందమూరి తారకరామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు.

ఉమామహేశ్వరి చనిపోయిన సమయంలో కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం భార్య ప్రణీత, తల్లి శాలిని, సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసిntr జూబ్లీహిల్స్లోని మేనత్త నివాసానికి వచ్చారు.ఉమామహేశ్వరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు కుటుంబసభ్యులతో మాట్లాడిన తారక్… తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారికి ధైర్యం చెప్పారు.

LEAVE A RESPONSE