శవ రాజకీయాల నుండి పుట్టిన పార్టీ వైసీపీ

– అందుకే వారు నిత్యం శవ రాజకీయాలే చేస్తుంటారు
– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ టౌన్ : నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్ నందు గురువారం నాడు సాయంత్రం వైస్సార్సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పై తెదేపా నేతలతో కలిసి మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఫిర్యాదు అనంతరం మాట్లాడుతూ.. స్వర్గీయ నందమూరి తారకరామారావు నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి యొక్క మరణాన్ని,, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై అంటగట్టుతూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దేవేందర్ రెడ్డికి తగదు.

శవ రాజకీయాల నుండి పుట్టిన పార్టీ వైసీపీ,అందుకే వారు నిత్యం శవ రాజకీయాలే చేస్తుంటారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టడమే శవ రాజకీయాలు నుండి పుట్టింది.అందుకే వారు నిత్యం శవ రాజకీయాలు చేస్తుంటారు.జగన్మోహన్ రెడ్డి తన తండ్రి శవం పక్కన పెట్టుకొనే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేయించాడు.

తన తండ్రి మృతిని చూపించి ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ ఓదార్పు యాత్ర చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ కి రాష్ట్రం లో పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలిత్తిపోతున్న వైసీపీ నాయకులు, ఆయన ప్రతిష్ట దిగజార్చడానికి అనేక కుట్రలు చేస్తున్నారు.అందులో భాగంగానే అన్న ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మృతి కి లోకేష్ కారణం అని భూటకపు ప్రచారం మొదలెట్టారు.

లోకేష్ కి జనంలో పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలెత్తుతున్న వైసీపీ, అందుకే లోకేష్ పై ఈ నిందలు. చంద్రబాబు నాయుడు ని,లోకేష్ బాబును ఎదుర్కొన లేక వైసీపీ పార్టీ ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నది.ఏదోవిధంగా లోకేష్ ఇమేజ్ దెబ్బ తీయక పోతే భవిష్యత్తులో తమకు ఇబ్బంది అనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ ఎక్కడ ఏమి జరిగినా దానికి కారణం లోకేష్ గారే అని విషప్రచారం చేయడం సిగ్గుచేటు. వైసీపీ పార్టీ ఇటువంటి తప్పుడు, నీచ శవరాజకీయాలు మానుకోవాలని తంగిరాల సౌమ్య హెచ్చరించారు.

Leave a Reply